సిద్దిపేట జిల్లాలో ఆసక్తికర ఘటన
సిద్దిపేట జిల్లా (Siddipet District) ధూల్మిట్ట కస్తూర్బా బాలికల విద్యాలయంలో గణేశ్ (Ganesh) నవరాత్రి ముగింపు ఉత్సవాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విద్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం వద్దకు వచ్చిన వానరం మొక్కుతూ తన భక్తిని చాటుకుంది. సుమారు 10 నిమిషాల పాటు విగ్రహం చెంతనే కూర్చుని ఉంది. ఇది చూసిన విద్యార్థినులంతా జై శ్రీరామ్ (Jai Sri Ram) అంటూ నినాదాలు చేశారు. అనంతరం అక్కడినుంచి వానరం వెళ్లిపోయింది. ఈ దృశ్యాన్ని పలువురు తమ సెల్ఫోన్ల (Cell phones)లో బంధించారు. అనంతరం ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థినులు వినాయకుడిని నిమజ్ఞనం చేశారు.








