ఉదయం పూట ఉడికించిన గుడ్డు లేదా ఆమ్లెట్ తింటే శరీరానికి కావలసిన ప్రొటీన్ అంది, రోజంతా అలసట లేకుండా ఉత్సాహంగా ఉండవచ్చు.
గుడ్లు
ఫైబర్ అధికంగా ఉండే ఓట్స్ లేదా ఓట్ మీల్ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ సాఫీగా సాగి, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
ఓట్స్
పెסలు, శనగలు వంటి మొలకలను బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకుంటే విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా అంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
మొలకెత్తిన గింజలు
అరటిపండు, యాపిల్ వంటి పండ్లు మరియు బాదం, వాల్‌నట్స్ వంటి నానబెట్టిన నైట్స్ తింటే తక్షణ శక్తితో పాటు మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
పండ్లు మరియు డ్రై ఫ్రూట్స్
మన సాంప్రదాయ బ్రేక్‌ఫాస్ట్ అయిన ఆవిరి మీద ఉడికించిన ఇడ్లీ లేదా ప్రొటీన్ రిచ్ పెసరట్టు తేలికగా అరిగి శక్తిని అందిస్తాయి.
ఇడ్లీ లేదా పెసరట్టు
ప్రోబయోటిక్స్ నిండిన గ్రీక్ యోగర్ట్ లేదా మజ్జిగ తీసుకోవడం ద్వారా గట్ హెల్త్ మెరుగై రోజంతా కడుపు ప్రశాంతంగా ఉంటుంది.
గ్రీక్ యోగర్ట్ లేదా పెరుగు
హోల్‌వీట్ బ్రెడ్‌పై పీనట్ బటర్ రాసుకుని తింటే మంచి ఫ్యాట్స్, ప్రొటీన్ అంది ఎక్కువ సేపు ఆకలి వేయకుండా శక్తినిస్తుంది.
పీనట్ బటర్ టోస్ట్
పాలతో చేసిన టీ కాకుండా ఉదయం పూట గ్రీన్ టీ లేదా నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీరు తాగితే శరీరం డిటాక్స్ అవుతుంది.
గ్రీన్ టీ లేదా హెర్బల్ డ్రింక్