25న క్యూర్ పరిధిలో సెలవు
ఈ నెల 25న గణేశ్ నిమజ్జనం (Ganesh Immersion) సందర్భంగా క్యూర్ పరిధిలో ఉన్న హైదరాబాద్ (Hyderabad), రంగారెడ్డి (Ranga Reddy), మేడ్చల్ ( Medchal) జిల్లాల్లోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ నెల 25కు బదులుగా నవంబర్ 14 రెండో శనివారం పనిదినంగా పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.








