గతంలోనే చెప్పాము.. ఇప్పుడు అదే జరుగుతుంది : కేటీఆర్
కాంగ్రెస్ (Congress) ఉంటే కరెంట్ ఉండదని గతంతో తాము చెప్పామని, ఇప్పుడు అదే జరుగుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చింది, కరెంట్ (Electricity) పోయింది అంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. మా హయాంలో విద్యుత్ వ్యవస్థ చాలా అద్బుతంగా నడిచింది. కాంగ్రెస్ వచ్చాక రాష్ట్రంలో కరెంట్ ఇబ్బందులు ఉన్నాయని అని పత్రికలు కథనాలు రాశాయి. ఏ సబ్స్టేషన్లో చూసినా 6 గంటలకు మించి విద్యుత్ సరఫరా ఉండట్లేదు. కరెంట్ ఇవ్వట్లేదని అడిగితే ఎల్నినో అంటున్నారు. ఎన్నినో వల్ల కాదు, కాంగ్నినో వల్లే ఈ కరెంట్ కోతలు. జెన్కో (Genco)లో బొగ్గు నిల్వలు లేవు. సింగరేణి (Singareni)లో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది. బొగ్గు ఉంటే ఎందుకు థర్మల్ విద్యుత్ స్టేషన్లను మÖసేస్తున్నారు? నీళ్లు లేక జల విద్యుత్ ప్లాంట్లు మÖతపడ్డాయి. మీరు హామీ ఇచ్చినట్లుగా రాష్ట్రంలోని రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు.








