శివ కార్తికేయన్ 27వ సినిమా షురూ
కోలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న యంగ్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టారు. కమల్ హాసన్(kamal haasan) నిర్మాణంలో తెరకెక్కుతున్న సీయన్(Seyon) తో ప్రస్తుతం బిజీగా ఉన్న ఆయన.. తన తర్వాతి సినిమాను కూడా పట్టాలెక్కించారు. పార్కింగ్(Parking) మూవీతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ కుమార్ బాలకృష్ణ(ram kumar balakrishna)తో శివ కార్తికేయన్ జతకట్టడం ఇప్పుడు కోలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.
శివ కార్తికేయన్ కెరీర్లో 27వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో పాటు, షూటింగ్‌ను కూడా ప్రారంభించినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ కూడా సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. పార్కింగ్ తో కథను డిఫరెంట్‌గా డీల్ చేసిన రామ్ కుమార్ బాలకృష్ణ.. శివ కార్తికేయన్ కోసం ఎలాంటి కథను సిద్ధం చేశారనే దానిపై ఇప్పుడు చర్చ మొదలైంది.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ సత్య జ్యోతి ఫిలిమ్స్(Satyajyothi films) నిర్మిస్తోంది. శివ కార్తికేయన్ మార్కెట్‌కు తగ్గట్టుగా సినిమాను గ్రాండ్ స్కేల్లో రూపొందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు, సంగీత బాధ్యతల్ని ఎవరు తీసుకోనున్నారనే విషయాలను మేకర్స్ ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే ఈ వివరాలతో పాటు సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.








