సిగ్మా.. ముగ్గురికీ కీలక పరీక్ష
అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సిగ్మా(Sigma)పై ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్న అంశాల్లో జాసన్ సంజయ్(Jason sanjay) డైరెక్టర్ గా పరిచయం కావడం ఒకటి. మొదటి సినిమాతోనే తనలోని దర్శక ప్రతిభను ఎలా చూపించబోతున్నాడనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ ప్రాజెక్ట్ అతని కెరీర్‌కు తొలి మెట్టు కానుంది.
మరోవైపు ఫరియా అబ్దుల్లా(Faria Abhullah)కు కూడా సిగ్మా కీలకంగా మారింది. వరుసగా ఆశించిన స్థాయిలో రిజల్ట్స్ రాకపోవడంతో ఈ సినిమాపై ఆమెకు ప్రత్యేకమైన ఆశలు ఉన్నాయి. ఇక హీరో సందీప్ కిషన్(Sundeep kishan)కు ఈ సినిమా మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. కొంతకాలంగా సరైన కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఆయనకు సిగ్మా రిజల్ట్ కెరీర్లో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే అవకాశం ఉంది.
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) సిగ్మా ఈవెంట్‌కు హాజరవడం సినిమాకు మంచి ప్రచారాన్ని తీసుకొచ్చింది. దీంతో రిలీజ్ కు ముందే ప్రాజెక్ట్‌పై మరింత దృష్టి పడింది. ఒకే సినిమాతో డైరెక్టర్ గా జాసన్ సంజయ్, హీరోయిన్గా ఫరియా, హీరోగా సందీప్ కిషన్ తమ కెరీర్లకు బలమైన ఊపును అందుకోవాలని చూస్తుండటంతో సిగ్మా పై అంచనాలు మరింత ఆసక్తికరంగా మారాయి. అక్టోబర్ 2న ఈ ముగ్గురి ఆశలను సినిమా ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి.








