28th September 2026

_________

- Bhuvana

 ఉదయం లేవగానే ఫోన్ చూడటం వల్ల కలిగే నష్టాలు

నిద్ర లేవగానే ఆఫీస్ మెయిల్స్ లేదా బ్యాడ్ న్యూస్ చూడటం వల్ల మెదడు ఒక్కసారిగా ఒత్తిడికి గురై రోజంతా ఆందోళన పెరుగుతుంది.

విపరీతమైన మానసిక ఒత్తిడి

ఉదయం పూట సోషల్ మీడియా రీల్స్ చూడటం వల్ల మెదడులోని ఫోకస్ పవర్ తగ్గిపోయి, ఏ పని మీద సరిగ్గా శ్రద్ధ పెట్టలేరు.

ఏకాగ్రత మరియు జ్ఞాపకశక్తి లోపం

ఫోన్ నోటిఫికేషన్లు తక్షణ ఆనందాన్ని ఇచ్చే డోపమైన్‌ను విడుదల చేసి, రోజంతా అనవసరంగా ఫోన్‌పై ఆధారపడేలా చేస్తాయి.

డోపమైన్ ఉచ్చులో మెదడు

ఐదు నిమిషాలు అనుకుని గంటల తరబడి సోషల్ మీడియాలో గడపడం వల్ల ఉదయం పనులన్నీ ఆలస్యమై హడావుడి ఏర్పడుతుంది.

సమయం వృథా మరియు ఆలస్యం

చీకటిలో లేదా ఉదయం పూట ప్రకాశవంతమైన స్క్రీన్ చూడటం వల్ల కళ్లు త్వరగా అలిసిపోయి, కంటి చూపు మందగించడం ఖాయం.

కంటి ఆరోగ్యం మరియు తలనొప్పి

ఉదయం ప్రశాంత సమయంలో మెదడుకు కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. ఫోన్ చూడటం వల్ల ఆ స్పేస్ కోల్పోతాము.

సృజనాత్మక ఆలోచనలకు అడ్డుకట్ట

ఇతరుల పోస్టులు చూసి పోల్చుకోవడం లేదా అనవసర విషయాలు చదవడం వల్ల రోజంతా మూడ్ చెడిపోయి నిరుత్సాహం కలుగుతుంది.

ప్రతికూల ఆలోచనల ప్రభావం