అక్టోబర్ 17 న ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా, వైభవంగా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సంబరాలు అక్టోబర్ 17 వ తేదీన మధ్యాహ్నం 3:00 గంటల నుంచి రాత్రి 7:00 గంటల వరకు వుంటాయి. Windemere Ranch Middle School లో సెలబ్రేషన్స్ జరుగుతాయి. మొగుడ్స్ పెళ్లామ్స్ బాబీ, చందు లైవ్ ఎంటర్ టైన్ మెంట్ కూడా అందిస్తున్నారు.
ఇంతటి గ్రాండ్ సెలబ్రేషన్స్ కి మనమంతా మన మన కుటుంబ సభ్యులతో సహా హాజరవుదాం. వచ్చే సంవత్సరం వరకూ గుర్తుండిపోయేలా సెలబ్రేషన్స్ చేసుకుందాం. బతుకమ్మ ఆట పాటలతో సంబరాలు చేసుకుందాం. మన సంస్కృతిని, సంప్రదాయాలను మరింత విస్తరించుకుందాం. వాటి నుంచి ప్రేరణ పొందుదాం. ఈ సెలెబ్రేషన్స్ కి శ్రీకర్ పాలేపు (వెల్త్ + ఈక్విటీ రియల్ ఎస్టేట్), సిచర్ గ్లోబల్ సొల్యూషన్స్ స్పాన్సర్లుగా వున్నారు.
మరిన్ని వివరాల కోసం w.w.w.wetaglobal.org వెబ్ సైట్ ను కూడా సంప్రదించవచ్చు. సెలబ్రేషన్స్ కి హాజరయ్యే వారు https://WETA_Bathukamma_
కార్యక్రమ వివరాలు :
తేదీ : అక్టోబర్ 17, 2026
సమయం : మధ్యాహ్నం 3:00 గంటల నుంచి రాత్రి 7:00 గంటల వరకు
వేదిక : Windemere Ranch Middle School








