అమెరికాలో ఆంధ్రా యూనివర్సిటీ అలుమ్ని సమావేశాలు
ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు అమెరికాలో అలుమ్ని సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆలుమ్ని అసోసియేషన్ నార్త్ అమెరికా, మరిన్ని అసోసియేషన్స్ కలిసి వీటిని నిర్వహించనున్నాయి. నార్త్ అమెరికా న్యూజెర్సీలోని ఫోర్డ్స్ లో వున్న రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్ లో ఈ సెలెబ్రేషన్స్ జరుగుతాయి. అక్టోబర్ 17 వ తేదీన ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకూ జరుగుతాయని ఆంధ్ర యూనివర్సిటీ రీయూనియన్ బాధ్యులు ప్రకటించారు.
ఈ సెంచునరీ సెలబ్రేషన్స్ కి చీఫ్ గెస్ట్ గా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్ హాజరవుతున్నారు.
చారిత్రాత్మకమైన మైలురాయిని స్మరించుకోవడానికి, ఉత్తర అమెరికా వ్యాప్తంగా వున్న AU పూర్వ విద్యార్థుల సహకారంతో AU అలూమ్ని న్యూజెర్సీ నిర్వహిస్తున్న ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాలలో పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. పూర్వ విద్యార్థులందరూ ఇందులో పాల్గొనాలని కోరుతున్నారు.
తమతో పాటు చదువుకున్న స్నేహితులందరూ తిరిగి కనెక్ట్ అవ్వడానికి, అప్పటి మధురమైన జ్ఞాపకాలను నెమరువేసుకోవడానికి ఈ ఈవెంట్ ఎంతో ఉపయోగపడుతుంది. చదువు బోధించిన ఉపాధ్యాయులు, మన స్నేహితులతో తిరిగి కనెక్ట్ అయ్యే అవకాశం కూడా దీని ద్వారా లభిస్తుంది.
మరిన్ని వివరాల కోసం
ప్రసాద్ తాత +1(314) 482-3465
కిశోర్ దుర్గా +1(609)240-3770
శ్రీని పరుచూరి +1(609)721-3336
సుబ్బారావు సన్నిధి +1(732)668-4325
వెంకట సత్య తాత +1(973)985-3409
మధు రాచకుల్ల +1(201)312-1305
రవి అన్నదానం +1(917)355-5503
కార్యక్రమ వివరాలు :
తేదీ : అక్టోబర్ 17,2026, శనివారం
వేదిక : ROYAL ALBERTS PALACE, FORDS, NEW JERSY, USA
ముఖ్య అతిథి : ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రొ. జీ.పీ. రాజ శేఖర్








