అక్టోబర్ 18 న డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలుగు పఠనా పోటీలు
డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (DTA) ఆధ్వర్యంలో ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలుగు పఠనా పోటీలు జరగనున్నాయి. అక్టోబర్ 18 వ తేదీన ఉదయం 10:00 గంటల నుంచి ఈ పోటీలు ప్రారంభం అవుతాయని నిర్వాహకులు తెలిపారు. sv టెంపుల్, 26233 టాఫ్ట్ రోడ్డు, నోవై, మిచిగన్ 48374 లో జరగనున్నాయి.
5 వ తరగతి లోపు పిల్లలకు మొదటి బహుమతిగా 100 డాలర్లు, రెండో బహుమతిగా 75 డాలర్లు, మూడో బహుమతిగా 50 డాలర్లు ఇవ్వనున్నారు.
అలాగే 6-8 వ తరగతి పిల్లల విషయంలో మొదటి బహుమతిగా 200 డాలర్లు, రెండో బహుమతిగా 100 డాలర్లు, మూడో బహుమతిగా 50 డాలర్లు ఇవ్వనున్నారు.
మరిన్ని వివరాల కోసం DTA సాంస్కృతిక కార్యదర్శి అర్చన చవాళ్ల 313-585-3145, DTA అధ్యక్షురాలు శుభ్రత గడ్డం 734-972-3536 సంప్రదించవచ్చు. అలాగే ఈ కార్యక్రమాన్ని శివరాం ప్రసాద్ యార్లగడ్డ సమర్పిస్తున్నారు.
ఈ కార్యక్రమం కోసం పేర్లను నమోదు చేసుకునేవారు దీనిలోని ఫ్లయర్ లోని క్యూఆర్ కోడ్ ద్వారా నమోదు చేసుకోవచ్చు.
ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలుగు పఠనా పోటీలు
తేదీ : 18 అక్టోబర్, ఆదివారం
సమయం : ఉదయం 10:00 గంటల నుంచి
వేదిక : కార్యక్రమ వివరాలు : sv టెంపుల్, 26233 టాఫ్ట్ రోడ్డు, నోవై, మిచిగన్ 48374
ప్రధాన ఆకర్షణలు :
5 వ తరగతి లోపు పిల్లలకు మొదటి బహుమతిగా 100 డాలర్లు, రెండో బహుమతిగా 75 డాలర్లు, మూడో బహుమతిగా 50 డాలర్లు ఇవ్వనున్నారు.
6-8 వ తరగతి పిల్లల విషయంలో మొదటి బహుమతిగా 200 డాలర్లు, రెండో బహుమతిగా 100 డాలర్లు, మూడో బహుమతిగా 50 డాలర్లు ఇవ్వనున్నారు.








