రియల్ ఎస్టేట్ లో విజయ్- రష్మిక మరో అడుగు
విజయ్ దేవరకొండ(vijay devarakonda), రష్మిక మందన్నా(rashmika mandanna) పేర్లు మరోసారి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డిస్కషన్స్ లో వినిపిస్తున్నాయి. టాలీవుడ్లో ఈ జంటకు ఉన్న క్రేజ్‌కు తోడు, వారి ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా తరచూ ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. తాజాగా తుక్కుగూడ సమీపంలోని ఫ్యూచర్ ట్రెండ్స్: ది వ్యాలీ లగ్జరీ విల్లా ఎన్‌క్లేవ్‌లో ఈ జంట ఓ విల్లాను కొనుగోలు చేసినట్లు కొత్త ప్రచారం మొదలైంది. అయితే ఈ విషయంపై విజయ్ లేదా రష్మిక నుంచి ఇప్పటివరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు.
హైదరాబాద్‌లో విజయ్‌కు ఇప్పటికే జూబ్లీహిల్స్‌లో బహుళ అంతస్తుల విలాసవంతమైన బంగ్లా ఉంది. కొంతకాలంగా అదే వారి ప్రధాన నగర నివాసంగా కొనసాగుతోంది. దీనికి తోడు నాగర్‌కర్నూల్ జిల్లా తుమ్మన్పేట్లో విజయ్ సొంత ప్రాంతంలో కొత్తగా నిర్మించిన ఫామ్‌హౌస్ కూడా ఉంది. పెళ్లి తర్వాత ఈ ఫామ్‌హౌస్‌కు వెళ్లిన విజయ్- రష్మిక అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించిన విషయం తెలిసిందే.
ఇక సినిమాల విషయానికి వస్తే ఈ జంట ప్రస్తుతం రణబాలి(ranabaali)తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. రాహుల్ సాంకృత్యాన్(rahul Sakrithyan) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers) నిర్మిస్తున్నారు. అక్టోబర్ 16న థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. సినిమా ప్రమోషన్స్‌తో పాటు తాజాగా వినిపిస్తున్న ప్రాపర్టీ వార్తలు కూడా ఈ జంటపై ఫోకస్‌ను మరింత పెంచుతున్నాయి.








