హుకూం మ్యాజిక్ మిస్ అవుతున్నట్టుందే?
జైలర్(jailer) సినిమా అంటేనే రజినీకాంత్(rajinikanth) మాస్ ఇమేజ్‌తో పాటు అనిరుధ్ రవిచందర్(anirudh ravichander) మ్యూజిక్ కూడా గుర్తొస్తుంది. ముఖ్యంగా హుకూం(hukum) సాంగ్ రిలీజ్ కు ముందే భారీ హైప్ తెచ్చుకుని, సినిమాలో ముత్తువేల్ పాండియన్ క్యారెక్టర్ కు ఒక స్పెషల్ మాస్ ఐడెంటిటీని తీసుకొచ్చింది. ఇప్పుడదే కాంబినేషన్ జైలర్2 కోసం తిరిగి రావడంతో సహజంగానే మ్యూజిక్‌పై అంచనాలు పెరిగాయి. అయితే అక్టోబర్ 2న రిలీజైన 12 సాంగ్స్ పూర్తి జ్యూక్‌బాక్స్ విన్న తర్వాత, మొదటి భాగంలో కనిపించినంత స్థాయిలో వెంటనే గుర్తుండిపోయే సాంగ్ ఏదనే డిస్కషన్ మొదలైంది.
జైలర్2(jailer2)లో అలా బొలెలో, వన్ సన్ వన్ మూన్, వన్ నేమ్, బిందాస్, వీరమారి, దిల్ హారేయా, హుకూం రీలోడెడ్ వంటి సాంగ్స్ ఉన్నాయి. ఒక్కో సాంగ్‌కు ఒక్కో ట్రీట్మెంట్ ఇచ్చినా, మొత్తం ఆల్బమ్‌కు సంబంధించి ఆడియన్స్ రెస్పాన్స్ మాత్రం మిక్డ్స్ గానే కనిపిస్తోంది. ముఖ్యంగా అలా బొలెలో సాంగ్‌లో మలయాళ పదాల ఉచ్చారణపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేయగా, మరోవైపు సోషల్ మీడియాలో ఆ సాంగ్ డిస్కషన్ కు రావడం కూడా కనిపించింది. వన్ నేమ్ మాస్ టచ్‌తో, బిందాస్ డ్యాన్స్ నెంబర్‌గా తమదైన స్పేస్‌ను తీసుకున్నాయి.
అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. 12 సాంగ్స్ ఉన్న ఆల్బమ్‌పై డిస్కషన్ జరుగుతున్నా, పోలిక మాత్రం మళ్లీ మళ్లీ హుకూం దగ్గరకే వెళ్తోంది. మొదటి భాగం సెట్ చేసిన మ్యూజిక్ బెంచ్‌మార్క్ కారణంగా జైలర్2 సాంగ్స్ ను విడిగా కాకుండా పాత పాటల ప్రభావంతోనే వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్టోబర్ 15న సినిమా రిలీజ్ కు ముందే మ్యూజిక్‌పై ఆడియన్స్ అభిప్రాయం బయటపడుతుండటంతో, సినిమాలోని సీన్స్, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సాంగ్స్ ఇంపాక్ట్‌ను ఎలా మార్చబోతున్నాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.








