చుట్టమల్లే పై ఏఐ దుర్వినియోగం.. సీరియస్ అయిన ఎన్టీఆర్, జాన్వీ
దేవర(devara) మూవీలోని చుట్టమల్లే(chuttamalle) సాంగ్ కు సంబంధించిన వీడియోను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా మార్చిన ఘటనపై జూనియర్ ఎన్టీఆర్(jr. ntr), జాన్వీ కపూర్(janhvi kapoor) తీవ్రంగా స్పందించారు. ఒరిజినల్ సాంగ్ లో లేని దృశ్యాలను AI సాయంతో క్రియేట్ చేసి, జాన్వీ రూపాన్ని మార్చిన వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. దీంతో సదరు వ్యక్తుల అనుమతి లేకుండా వారి ముఖాలు, శరీర రూపాలను డిజిటల్‌గా మార్చి తప్పుడు కంటెంట్ రూపొందించడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. చుట్టమల్లే సాంగ్‌కు అనిరుధ్(anirudh) మ్యూజిక్ అందించగా, శిల్పా రావు(Shilpa rao) ఆలపించారు. ఎన్టీఆర్, జాన్వీపై తెరకెక్కించిన ఈ సాంగ్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
వీడియో వ్యవహారంపై రియాక్ట్ అయిన ఎన్టీఆర్.. AIని ఉపయోగించి ఒక మహిళను అవమానకరంగా చూపించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కంటెంట్‌ను రూపొందించిన, ప్రచారం చేసిన వారిపై అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన మార్గాల్లో చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. మహిళలను గౌరవించే సంస్కృతి గురించి ప్రస్తావిస్తూ, టెక్నాలజీను ఇలాంటి విధ్వంసకర ప్రయోజనాలకు ఉపయోగించడాన్ని ఆయన తప్పుబట్టారు. దీంతో ఈ వ్యవహారం కేవలం సినీ సెలబ్రిటీకి సంబంధించిన అంశంగా కాకుండా, డిజిటల్ వరల్డ్ లో వ్యక్తిగత గోప్యతకు ఎదురవుతున్న సవాలుగా మారింది.
మరోవైపు జాన్వీ కపూర్ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ AIతో రూపొందించిన ఫేక్ వీడియోలను క్రియేట్ చేయడం, షేర్ చేయడం లేదా ఎంకరేజ్ చేయొద్దని కోరారు. తన పర్మిషన్ లేకుండా రూపొందించిన ఇలాంటి కంటెంట్‌పై లీగల్ యాక్షన్స్ ఉంటాయని ఆమె వెల్లడించారు. సెలబ్రిటీల ఫొటోలు, వీడియోలను ఉపయోగించి డీప్‌ఫేక్ కంటెంట్ క్రియేట్ చేయడం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన మరోసారి AI వినియోగానికి బాధ్యతాయుతమైన నియంత్రణ, డిజిటల్ అవగాహన అవసరాన్ని తెరపైకి తెచ్చింది.








