ఐ హేట్ మ్యారేజ్ ట్రైలర్ విడుదల!
సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్’. పరమేష్ రేణు కుంట్ల దర్శకుడు. ఆర్య సినిమా పతాకంపై మాదం దయానంద్, కార్తీక్ వెంపటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు Vijay C Kumar డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీని అందించారు. ఈ నెల 27న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ మంచి ఆదరణ అందుకుంది. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను మేకర్స్ సోమవారం విడుదల చేశారు. ట్రైలర్‌ను చూస్తుంటే నేటి తరం యువతకు నచ్చే అంశాలతో పాటు ప్రతి యువత ఈ సినిమాకు కనెక్ట్ అయ్యే విధంగా కనిపిస్తుంది.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ” ప్రేమ, పెళ్లి, కెరీర్‌తో పాటు స్వతంత్రంగా జీవించాలనే నేటి Gen Z తరం ఆలోచనలు, భావజాలాన్ని వాస్తవానికి దగ్గరగా చూపించే ప్రయత్నం ఈ చిత్రంలో చేశాను. ప్రతి సన్నివేశం ఎంతో సహజంగా ఉంటుంది. ఇందులోని భావోద్వేగాలు ఆడియన్స్‌ను కట్టిపడేస్తాయి. ఎలాంటి సినిమాటిక్ అతిశయోక్తులు లేకుండా, నిజ జీవితంలో యువత ఎదుర్కొనే భావోద్వేగాలు, నిర్ణయాలను సహజంగా ఆవిష్కరించే ప్రయత్నం ఈ చిత్రంలో కనిపించనుంది. కొత్త తరహా సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు.
ఇవి కూడా చదవండి
సుగి విజయ్, జుప్పీ భద్ర జంటగా నటించిన ఈ చిత్రంలో హారిక రాజేందర్, సాహితి కృష్ణ కీలక పాత్రల్లో నటించారు. పృథ్వీరాజ్, రవివర్మ అడ్డూరి,ప్రభావతి, ఆశ్రిత వేముగంటి, లోహిత్ కుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో బేబి తమోఘ్న, రాధ రాయసం, లక్ష్మి, జాకీర్, విజయ్ కుమార్, దాసరి పద్మ రేఖ, శ్రీదేవి ఆర్రోజు, మెయిల్ రమేష్, అరుణ్ కుమార్ రెడ్డి, ప్రముఖ నటి ఇందు, అఖండ సుధాకర్ రెడ్డి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.







