విశ్వంభర కోసం భారీ రిస్క్ తీసుకుంటున్న మైత్రి డిస్ట్రిబ్యూషన్!
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న భారీ ఫాంటసీ మూవీ విశ్వంభర(Vishwambhara) మరోసారి ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వశిష్ఠ(Vassishta) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదట్లో భారీ అంచనాలను సొంతం చేసుకున్నప్పటికీ, రిలీజ్ చేసిన ప్రమోషన్స్ పై వచ్చిన రెస్పాన్స్ తో పాటు నిర్మాణ పనుల్లో ఆలస్యం కారణంగా అనుకున్న టైమ్ కు ఆడియన్స్ ముందుకు రాలేకపోయింది. ప్రస్తుతం సినిమా వర్క్స్ ఫైనల్ స్టేజ్ కు చేరుకుంటున్నాయనే వార్తల నేపథ్యంలో రిలీజ్ డేట్ పై ఆసక్తి పెరుగుతోంది.
తాజాగా ఈ సినిమా తెలంగాణ థియేట్రికల్ బిజినెస్‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్ సమాచారం బయటకు వచ్చింది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రి డిస్ట్రిబ్యూషన్(Mythri distribution) ఏకంగా రూ.40 కోట్లకు తెలంగాణ రైట్స్ ను సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో వాల్తేరు వీరయ్య(valtair veerayya)తో మంచి లాభాలు అందుకున్న ఈ సంస్థ, ఇప్పుడు విశ్వంభర(Vishwambhara)పై ఇంత భారీ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టడం ఇండస్ట్రీలో డిస్కషన్ కు దారితీస్తోంది.
ఇవి కూడా చదవండి
అయితే సినిమా రిలీజ్ లో జరిగిన జాప్యం నేపథ్యంలో ఈ స్థాయి బిజినెస్‌ను కొంత రిస్క్‌గానే చూడాలి. ఆలస్యమైన సినిమాల్లో కొన్ని బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తే, మరికొన్ని ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. పుష్ప2(Pushpa2), ఓజీ(OG), దేవర(Devara) వంటి సినిమాలు సక్సెస్‌లు అందుకోగా, రాజాసాబ్(Rajasaab), ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagath Singh), హరిహర వీరమల్లు(Hari Hara veeramallu) నిరాశపరిచాయి. మరి విశ్వంభర ఈ రెండు కోవల్లో దేనికి చేరుతుందో చూడాలి.







