సినిమా ఎంపికల్లో తప్పులు చేశా.. ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నా !
టాలీవుడ్లో అతి తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల(Sree Leela) తన కెరీర్ ఆరంభంలో సినిమాల ఎంపిక విషయంలో చేసిన పొరపాట్ల గురించి తాజాగా స్పందించింది. ధనుష్(Dhanush) నటించిన ఓం(OM) తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న ఆమె.. ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో తనకు కథలను ఎంచుకునేంత మెచ్యూరిటీ, ఫ్రీడమ్ లేవని వెల్లడించింది. వచ్చిన ఛాన్స్ లను అందుకుంటూ ముందుకు సాగానని తెలిపింది.
ఇవి కూడా చదవండి
చిన్న వయసులోనే సినిమాల్లోకి రావడంతో అప్పట్లో డెసిషన్స్ తీసుకునే విషయంలో అంతగా అవగాహన ఉండేది కాదని శ్రీలీల పేర్కొంది. అయితే ఇండస్ట్రీలో కొంతకాలం ప్రయాణించిన తర్వాత తన డెసిషన్స్ ను రివ్యూ చేసుకున్నానని, కెరీర్‌ను మరింత జాగ్రత్తగా నిర్మించుకోవాల్సిన అవసరాన్ని గుర్తించానని చెప్పింది. ప్రస్తుతం స్టోరీ సెలెక్షన్ విషయంలో తన ఆలోచనా విధానం పూర్తిగా మారిందని, తనకు నచ్చిన పాత్రలు, కథలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు క్లారిటీ ఇచ్చింది.
ఇదిలా ఉంటే, గత కొంతకాలంగా శ్రీలీల కొత్త తెలుగు సినిమాలకు సైన్ చేసింది లేదు. ప్రస్తుతం ఆమె ఆశలన్నీ ఓం సినిమాపైనే ఉన్నాయి. రాజ్‌కుమార్ పెరియసామి(Rajkumar periyasaami) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామాలో ధనుష్, మమ్ముట్టి(Mammootty), సాయిపల్లవి(Sai Pallavi) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో శ్రీలీల మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తోంది.







