నితిన్ సినిమాకు నాని బ్రాండ్‌తో భారీ బిజినెస్!
కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరో నితిన్(nithin), కొంత గ్యాప్ తర్వాత అలియాస్ రుక్మిణి(Alias Rukmini) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నేచురల్ స్టార్ నాని(nani) నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిన్న సినిమా ఇప్పటికే బిజినెస్ పరంగా భారీ అంచనాలను అందుకుంటోంది. నానిపై ఉన్న నమ్మకంతో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్(Netflix) ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే సినిమా నిర్మాణానికి పెట్టిన పెట్టుబడి పూర్తిగా తిరిగి వచ్చినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
ఇక ప్రస్తుతం థియేట్రికల్ బిజినెస్‌పై నిర్మాతలు దృష్టి సారించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ద్వారా సుమారు రూ.25 కోట్ల బిజినెస్ ను సాధించాలని నాని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇప్పటికే నైజాం, వైజాగ్ రైట్స్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil raju) ఫ్యాన్సీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. డిసెంబర్ మొదటి వారంలో పలు సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ ఈ స్థాయి బిజినెస్ జరగడం విశేషంగా మారింది.
నితిన్ ప్రస్తుతం కెరీర్లో ఆశించిన ఫలితాలు అందుకోలేకపోతున్నా, నాని బ్రాండ్ వాల్యూతో ఈ సినిమా బిజినెస్ జోరుగా సాగుతోంది. అన్ని రైట్స్ ద్వారా నిర్మాతలకు భారీ లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మురళీకాంత్ దేవసోత్(muralikanth devasoth) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నితిన్ సరసన ఆఫియా సయ్యద్(Aafiya syed) హీరోయిన్ గా నటిస్తుంది. నాని అక్క దీప్తి గంటా ఈ సినిమాను నిర్మిస్తోంది.







