భోగికి సెన్సార్ క్లియరెన్స్.. రిలీజ్ డేట్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!
చార్మింగ్ స్టార్ శర్వానంద్(Sharwanand) నటిస్తున్న తాజా సినిమా భోగి(Bhogi) రిలీజ్ కు మార్గం సుగమమవుతోంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. సంపత్ నంది(sampath Nandi) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దీపావళి సందర్భంగా రిలీజ్ చేయాలని మొదట భావించారు. అయితే అనూహ్యంగా ఎదురైన సెన్సార్ ప్రాసెస్ లో ఆలస్యం కారణంగా మూవీ రిలీజ్ ను వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో కొత్త రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, భోగి సినిమాకు సెన్సార్ ప్రక్రియ పూర్తైనట్లు తెలుస్తోంది. సినిమాలోని భారీ యాక్షన్ సీన్స్, వయొలెన్స్ సీన్స్ ను పరిగణనలోకి తీసుకున్న సెన్సార్ బోర్డు ఈ సినిమాకు A సర్టిఫికెట్ జారీ చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్న సెన్సార్ క్లియరెన్స్ లభించినట్లయింది.
ఈ నేపథ్యంలో మూవీ టీమ్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. నవంబర్ 27న సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్స్ రెడీ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశముంది. అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran), డింపుల్ హయాతి(Dimple Hayathi) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా శర్వానంద్‌కు ఎలాంటి సక్సెస్‌ను అందిస్తుందో చూడాలి.







