మోడ్రన్ లుక్ లో ఎట్రాక్ట్ చేస్తున్న యుక్తి
కే ర్యాంప్(K Ramp) సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్న యుక్తి తరేజా(Yukti Tareja) పలు భాషల్లో నటిస్తూ కెరీర్లో ఎంతో బిజీగా ముందుకెళ్తుంది. ఓ వైపు సినిమాలు, మరోవైపు ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ లో సత్తా చాటుతున్న యుక్తి ఇంకోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది.

అందులో భాగంగానే తాజాగా అమ్మడు బీచ్ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో యుక్తి లైట్ బ్లూ కలర్ రిబ్డ్ నిట్ క్రాప్ టాప్ కు ఫుల్ లెంగ్త్ స్లీవ్స్, స్లీవ్స్ కు ఫ్లేర్డ్ బెల్ కఫ్స్ రాగా, ఈ అవుట్‌ఫిట్ ఆమెకు మోడర్న్ లుక్ ను తెచ్చిపెట్టింది.

క్రాప్ టాప్ కు మ్యాచింగ్ గా బాటమ్ జీన్స్, తలకు హెడ్ స్కార్ఫ్, మెడలో చిన్న ముత్యాల దండ ధరించి మోడ్రన్ లుక్ లో మెరవగా, నెటిజన్లు ఆమె లుక్ కు ఫిదా అవుతూ వాటిని నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు.








