లవ్ స్టోరీల వైపు అడుగులేస్తున్న నాని
నేచురల్ స్టార్ నాని(nani) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటివరకు ఎక్కువగా యాక్షన్, కమర్షియల్ కథలపై దృష్టి పెట్టిన ఆయన.. రాబోయే రోజుల్లో తన సినిమాల ఎంపికలో కొంత వైవిధ్యం చూపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సుజీత్(Sujeeth) దర్శకత్వంలో బ్లడీ రోమియో(Bloody romeo) సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్న నాని.. ఈ సినిమా కోసం స్టైలిష్ యాక్షన్ డ్రామాను ఎంచుకున్నారు. వచ్చే నెలలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుండగా, 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
బ్లడీ రోమియో తర్వాత మాత్రం వరుసగా సీరియస్ యాక్షన్ కథలనే కొనసాగించకుండా.. ఎమోషన్స్ కు, ప్రేమకు ప్రాధాన్యమున్న సినిమాలపై నాని ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే మరో లవ్‌స్టోరీకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 96, సత్యం సుందరం(Satyam sundaram) సినిమాలతో తనదైన ముద్ర వేసిన డైరెక్టర్ ప్రేమ్ కుమార్(prem kumar) చెప్పిన కథ నానికి బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ ఖరారైనట్లు సమాచారం. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాను ఏషియన్ సునీల్(Asian suneel), భవ్య క్రియేషన్స్(bhavya creations) సంయుక్తంగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
దీంతో పాటూ డైరెక్టర్ వెంకీ అట్లూరి(Venky atluri)తోనూ నాని డిస్కషన్స్ జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆ ప్రాజెక్ట్ కూడా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లే అవకాశముందని సమాచారం. ఇలా ఒకవైపు భారీ స్థాయి యాక్షన్ సినిమాలు, మరోవైపు ఫీల్‌గుడ్ ఎమోషనల్ ఎంటర్టైనర్లు, లవ్‌స్టోరీలతో నాని తన కెరీర్లో కొత్త కాంబినేషన్లకు తెరతీస్తున్నారు. ప్రేమ్ కుమార్‌తో చేయబోయే సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే వెలువడే అవకాశం ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి పెరుగుతోంది.








