త్రివిక్రమ్ ఆలస్యం.. భారీ ఛాన్స్ మిస్!
వెంకటేష్(venkatesh), త్రివిక్రమ్(Trivikram) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం(Aadarsha kutumbam)కు దసరా సీజన్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే మంచి అవకాశం చేజారిపోయింది. అక్టోబర్ 9న సినిమా రిలీజైతే, అక్టోబర్ 10 నుంచి మొదలయ్యే దసరా హాలీడేస్‌ను పూర్తిగా క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉండేది. తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలకు అక్టోబర్ 25 వరకు సెలవులు ఉండటంతో.. దాదాపు రెండు వారాల పాటు థియేటర్లకు స్ట్రాంగ్ ఆక్యుపెన్సీ లభించే అవకాశం ఉండేది. అయితే లాస్ట్ మినిట్ లో రిలీజ్ ప్లాన్ మారడంతో ఈ భారీ హాలిడే అడ్వాంటేజ్ ఇప్పుడు సినిమాకు దూరమైంది.
ఒక సినిమాకు రిలీజ్ డేట్ అనేది కేవలం క్యాలెండర్‌లోని డేట్ కాదు.. బాక్సాఫీస్ లెక్కల్లో కీలకమైన అంశం. ముఖ్యంగా వెంకటేష్ లాంటి ఫ్యామిలీ హీరోకు, త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ సినిమాకు దసరా సీజన్ కలిసొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సెలవుల్లో ఆడియన్స్ భారీగా వచ్చే అవకాశముండటంతో ఓపెనింగ్స్‌తో పాటు కలెక్షన్లను కూడా గణనీయంగా పెంచుకునే వీలుంటుంది. ఇప్పుడు రెగ్యులర్ సీజన్లో రిలీజైతే అదే స్థాయి కలెక్షన్లను రాబట్టడం అంత ఈజీ కాకపోవచ్చు. దీంతో ఆదర్శ కుటుంబం విషయంలో ఇది కేవలం వాయిదా కాదు.. ఒక మంచి బాక్సాఫీస్ అవకాశాన్ని కోల్పోయినట్టేననే డిస్కషన్ మొదలైంది.
ఇవి కూడా చదవండి
అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనే దానిపై కూడా ఇండస్ట్రీలో డిస్కషన్ సాగుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను ముందుగానే పూర్తి చేసి ఉంటే దసరా సీజన్‌ను సొంతం చేసుకునే అవకాశం ఉండేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంటే త్రివిక్రమ్ టీమ్‌కు ఇది ఒక మిస్డ్ ఛాన్స్‌గా మారింది. ఇప్పుడు అక్టోబర్ 30 లేదా నవంబర్ 6 తేదీల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే కొత్త డేట్ ఏదైనా.. దసరా ఇచ్చే అడ్వాంటేజ్ మాత్రం తిరిగి రాదు. దీంతో సినిమా కంటెంట్, మౌత్ టాక్‌పైనే ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.








