దిల్లీలో సీఐఐ భాగస్వామ్య సదస్సు.. హాజరైన సీఎం చంద్రబాబు
సీఐఐ భాగస్వామ్య సదస్సు కర్టెన్ రైజర్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ తో కలిసి హాజరైన సీఎం చంద్రబాబు
ఏపీకి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాకారాన్ని సీఐఐ సదస్సులో ప్రముఖంగా ప్రస్తావించిన ముఖ్యమంత్రి
ఎంఓయూలను సాకారం చేసే అంశంపై ఎక్కువ ఫోకస్ పెట్టామని పారిశ్రామిక వేత్తలకు వెల్లడించిన సీఎం చంద్రబాబు
పారిశ్రామిక ప్రొత్సాహాలను త్వరలో ప్రారంభించనున్నట్టు స్పష్టం చేసిన ముఖ్యమంత్రి
బిల్డ్ ఏపీ నినాదంతో పని చేస్తున్నామని ప్రకటించిన సీఎం చంద్రబాబు
సీఐఐ భాగస్వామ్య సదస్సు కర్టెన్ రైజర్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…
• 25 ఏళ్లుగా నిరంతరాయ ప్రజాసేవలో ఉన్న ప్రధాని మోదికి శుభాకాంక్షలు.
• డిజిటల్ ఇన్ ఫ్రాను దేశంలో తీసుకురావటంలో ప్రధాని మోదీది కీలక పాత్ర.
• అత్యద్భుతమైన రోడ్ నెట్వర్క్ కలిగిన భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది.
• రైల్వే నెట్వర్క్ లోనూ దేశం కీలక స్థానంలో ఉంది.
• పోర్టులు, ఎయిర్ పోర్టులు, రైల్వే, రోడ్ నెట్వర్క్ కలిగి ఉన్న బలమైన దేశాన్ని ప్రధాని తీర్చిదిద్దుతున్నారు.
• రక్షణ పరంగా అత్యంత భద్రత కలిగిన దేశంగా భారత్ ను తీర్చిదిద్దడంలో ప్రధాని పాత్ర అత్యద్భుతం.
• టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో కీలకంగా ఉన్న భారతీయులు ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలకు సారధ్యం వహిస్తున్నారు.
• ఏపీకి చేయూత ఇవ్వటంలో కేంద్రం, ప్రధాని మోదీ ముందు ఉన్నారు.
• పోలవరం, అమరావతి రాజధాని ప్రాజెక్టులతో పాటు వేర్వేరు ప్రాజెక్టులకు ఆర్ధిక సహకారం అందిస్తున్నారు.
• విశాఖ సహా వివిధ ప్రాంతాల్లో సెమీ కండక్టర్ యూనిట్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది.
• బిల్డ్ ఏపీ అనే నినాదంతో పని చేస్తున్నాం.
• ఏపీలో సంపద సృష్టించటంతో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
• గతేడాది నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో రూ.13.50 లక్షల కోట్లు ఒప్పందాలు జరిగాయి.
• గడచిన 28 నెలల్లో రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించగలిగాం.
• ఎంఓయూలకు మాత్రమే పరిమితం కావటం లేదు… వాటిని పెట్టుబడులుగా మలిచేలా కృషి చేస్తున్నాం.
• గూగుల్ 1 గిగావాట్ డేటా సెంటర్, ఆర్సెలార్ మిత్తల్ లాంటి ప్రముఖ కంపెనీలు ఏపీకి వచ్చాయి.
• గతేడాది ప్రకటించిన మేరకు పారిశ్రామిక ప్రోత్సాహకాలను నవంబరు 12,13 తేదీల్లో ప్రారంభిస్తాం.
• పెట్టుబడులకు అడ్డంకిగా ఉన్న నాలా యాక్టును రద్దు చేసేశాం.
• గోదావరి, కృష్ణ, పెన్నా, తుంగభద్ర, కావేరి నదులు కలిస్తే ఏపీ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు నీటి కొరతే రాదు.
• రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా తయారు చేయాలని నిర్దేశించుకున్నాం.
• సౌత్ ఈస్ట్ ఏషియాకు గేట్ వేగా ఏపీని మార్చటమే మా లక్ష్యం.
• దుగరాజపట్నంలో షిప్ బిల్డింగ్ సెంటర్ ఏర్పాటుకు మజగావ్ డాగ్ యార్డ్ లిమిటెడ్ ముందుకు వచ్చింది.
• మచిలీపట్నంలో గోవా షిప్ యార్డు సంస్థ నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు అంగీకరిచింది.
• డ్రోన్, ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లను కూడా తిరుపతి, లేపాక్షి, కొప్పర్తిలో ఏర్పాటు చేశాం.
• 5వ తరం ఫైటర్ జెట్ ప్రాజెక్టును కూడా రక్షణశాఖ రాయలసీమలో ప్రారంభించింది.
• 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీలో ఇప్పటికే 110 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తిపై ఒప్పందాలు కుదిరాయి.
• గ్రీన్ ఎనర్జీ ట్రాన్స్ మిషన్ కారిడార్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాం.
• రాష్ట్ర ప్రగతిలో ఉపయోగపడే ఏ విధానాన్నైనా తక్షణం అమలు చేయడానికి ఏపీ సిద్ధం.
• పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ఏఐ సహా పారిశ్రామిక, వాణిజ్య వేత్తలుగా తయారు చేసేలా పాఠ్యాంశాలను రూపొందిస్తున్నాం.
• డ్వాక్రా సంఘాల ఉత్పత్తులను స్వయం బ్రాండ్ పేరుతో అంతర్జాతీయ మార్కెట్లకు ప్రమోట్ చేస్తాం.
• డేటా లేక్ లాంటి వ్యవస్థల ద్వారా ఏఐ స్టాక్ లాంటి సాంకేతికతో వేగంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం.
• జీఎస్టీ పన్నుల వసూళ్లలో ఏఐ స్టాక్ అమలు చేయటం ద్వారా రాష్ట్రానికి ఆదాయం గణనీయంగా పెరిగింది.
• వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాల్లో ఉన్న అపారమై అవకాశాలను అందిపుచ్చుకునేలా స్పీడ్ ఆప్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నాం.
• బ్లూ ఎకానమీలో ఏపీ కీలకంగా ఉంది. అమరావతిలో క్వాంటం కంప్యూటర్ ఆపరేషన్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి మొదలవుతాయి.
• అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ద్వారా వివిధ రంగాల్లో నాయకత్వాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నాం.
• విశాఖ లాంటి డెస్టినేషన్లకు చేరుకునేలా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది.
• బాపట్ల లాంటి అద్భుతమైన తీర ప్రాంతాలు ఏపీలో అందుబాటులో ఉన్నాయి.
• సీఐఐ భాగస్వామ్య సదస్సుల నిర్వహాణ కోసం కేంద్రం అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలి.








