డాక్టర్లు Instagramలో రీల్స్ చెయ్యొచ్చా? NMC కొత్త రూల్స్ ఇవే!
—సూర్య ప్రకాష్ జోశ్యుల
మీరు Instagramలో Scroll చేస్తున్నారు. మధ్యలో ఒక Reel కనపడింది.
ఒక డాక్టర్ కెమెరా ముందు కూర్చొని ఉంటారు. పక్కనే ఒక పేషెంట్. “నాకు ఈ సమస్య ఎన్నో సంవత్సరాలుగా ఉంది. చాలా చోట్ల చూపించాను. కానీ ఈ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పూర్తిగా తగ్గిపోయింది” అని ఆ పేషెంట్ చెబుతాడు. వెంటనే Before & After ఫొటోలు కనిపిస్తాయి. చివర్లో ఒక చిన్న Line — “Appointment కోసం Bioలో ఉన్న Link క్లిక్ చేయండి.”
ఇలాంటి వీడియో చూసినప్పుడు మనలో చాలామందికి అది Advertisementలా అనిపించదు. ఎందుకంటే అక్కడ పెద్దగా “ADVERTISEMENT” అని కనిపించదు. ఒక నిజమైన పేషెంట్ మాట్లాడుతున్నాడు. ఒక డాక్టర్ కనిపిస్తున్నాడు. అక్కడ మేటర్ కూడా నిజంగానే అనిపిస్తోంది.
చూస్తున్న మనకు ఓ సందేహం వస్తుంది. ఇది Health Educationనా? లేక హెల్త్ Marketingనా?National Medical Commission ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఒక స్పష్టమైన గీత గీయాలని నిర్ణయించింది.
డాక్టర్ కూడా Influencer అయ్యాడు.. కానీ Healthcareలో ఆ గేమ్ వేరే
Social Media ప్రపంచం ఒక విచిత్రమైన మార్పు తీసుకొచ్చింది. ఒకప్పుడు డాక్టర్ అంటే Clinicలో కనిపించే వ్యక్తి. ఇప్పుడు అదే డాక్టర్ Instagramలో Reels చేస్తాడు, YouTubeలో Videos పెడతాడు, Podcastsలో మాట్లాడతాడు, Followers పెంచుకుంటాడు. అది ఒక విధంగా మంచిదే. ఆరోగ్యంపై అవగాహన పెరుగుతుంది. ప్రజలకు కొన్ని విషయాలు సులభంగా అర్థమవుతాయి. కానీ మరోవైపు ఒక కొత్త Marketing Model కూడా తయారైంది. ఫాలోవర్స్…పర్శనల్ బ్రాండ్..నమ్మకం, పేషెంట్స్.
ఇక్కడే సమస్య మొదలవుతుంది.
ఒక Restaurantకు Influencer “ఇక్కడ Food చాలా బాగుంది” అని చెబితే నచ్చకపోతే ఇంకో Restaurantకి వెళ్లిపోవచ్చు. కానీ ఒక Influencer “ఈ డాక్టర్ దగ్గరే ట్రీట్మెంట్ తీసుకోండి” అని చెబితే అది కేవలం Consumer Choice కాదు. అది ఒక వ్యక్తి ఆరోగ్య నిర్ణయం. అందుకే NMC ఇప్పుడు Medical Professionలోని Digital Marketingపై గట్టిగా దృష్టి పెట్టింది.
“100% Cure” అనే మూడు పదాలకు ఇక కనపడకూడదు
Medical Marketingలో ఒక క్లెయిమ్ చాలా పవర్ఫుల్. అదే “100% Cure.” . దాని తర్వాత “Guaranteed Results”, “Permanent Solution”, “Best Treatment”, “No Side Effects” లాంటి మాటలు వస్తాయి. సోషల్ మీడియాలో ఇవి Attention తెస్తాయి. కానీ Medicineలో ఒక చికిత్స అందరికీ ఒకే విధంగా పనిచేస్తుందని ముందే హామీ ఇవ్వడం అంత సులభం కాదు.
అందుకే NMC డాక్టర్లు, ఆసుపత్రులు తమ సేవలను ప్రచారం చేసుకునేటప్పుడు అతిశయోక్తి, నిర్ధారించలేని క్లెయిమ్స్, Guaranteed Outcomes, Superiority Claims చేయకూడదని స్పష్టం చేసింది.
ఆసుపత్రి తన దగ్గర ఏ Equipment ఉంది, ఏ Facilities ఉన్నాయి, ఏ Diagnostic Services అందుబాటులో ఉన్నాయి అనే విషయాలు చెప్పవచ్చు. కానీ “మా దగ్గరే బెస్ట్”, “మా ట్రీట్మెంట్తో గ్యారంటీగా నయం” అంటూ ప్రజల్లో ఒక నిర్దిష్ట ఫలితంపై నమ్మకం కలిగించేలా ప్రచారం చేయడం మాత్రం మరో చేయటం పద్దతి కాదు.
పెద్ద సమస్య Patient Testimonials దగ్గరే
ఇప్పుడు ఒకసారి Instagramలో కనిపించే Medical Reelsను గుర్తు చేసుకోండి. “డాక్టర్ గారు నాకు చాలా సహాయం చేశారు.” “నా సమస్య పూర్తిగా తగ్గిపోయింది.” , “నేను చాలా హాస్పిటల్స్‌కి వెళ్లాను. కానీ ఇక్కడే Solution దొరికింది.” ఇలాంటి వీడియోలు చాలా సహజంగా కనిపిస్తాయి. పేషెంట్ స్వయంగా మాట్లాడుతున్నాడు కాబట్టి మనకు అది Advertisementగా అనిపించదు.
కానీ NMC ఇప్పుడు డాక్టర్ తన Professional Promotion కోసం Patient Testimonials, Recommendations, Endorsements లేదా Reviewsను అడగడం లేదా షేర్ చేయడంపై ఆంక్షలు విధించింది.
ఇంకా ఒక అడుగు ముందుకెళ్లింది.
Fake Reviews మాత్రమే కాదు. Paid Reviews, Purchased Ratings, Manipulated Testimonials, Misleading Recommendations కూడా నిషేధం. అంటే Googleలో ఐదు స్టార్ రేటింగ్ తెచ్చుకోవడానికి Marketing Teamను పెట్టడం నుంచి, Instagramలో ఒక “Happy Patient” వీడియో తయారు చేయించడం వరకు మొత్తం వ్యవహారాన్ని ఇప్పుడు జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది.
“పేషెంట్ ఒప్పుకున్నాడు కదా?”
ఒక పేషెంట్ స్వయంగా తన ఫొటో, వీడియో వాడుకోవడానికి Permission ఇచ్చాడు అనుకుందాం. అంత మాత్రాన ఆ కంటెంట్‌ను Promotional Advertisementగా ఉపయోగించుకోవచ్చా? అనే సందేహం ఇక్కడ రావచ్చు. అయితే NMC సమాధానం …Patient Consent ఉన్నప్పటికీ, ఇప్పటికే నిషేధించబడిన Promotional Practice ఒక్కసారిగా అనుమతించబడదు.
అందుకే Before-and-After ఫొటోలు, Success Stories, Patient Videos, Clinical Images వంటి వాటిని ఉపయోగించే విషయంలో మరింత జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఇక్కడ సమస్య కేవలం “ఆ పేషెంట్ ఒప్పుకున్నాడా?” అనేది కాదు. ఆ పేషెంట్ కథను డాక్టర్ తన Business Promotion కోసం ఉపయోగిస్తున్నాడా? అనేదే కీలకం.
AI తో చేస్తే ఫరవాలేదా
ఇది 2026 కాబట్టి AIని పక్కన పెట్టి ఈ మేటర్ చర్చించటం అసాధ్యం. ఒక AI Tool తీసుకుని డాక్టర్ Avatar తయారు చేయొచ్చు. AI Voice పెట్టొచ్చు. ఒక imaginary patientను సృష్టించొచ్చు. Before & After Visual తయారు చేయొచ్చు. ఒక Medical Success Storyని మరింత Emotionalగా మార్చొచ్చు.
ఇంతకుముందు ఇలాంటి కంటెంట్‌పై “ఇది AIతో తయారు చేశారా?” అనే ప్రశ్న ఉండేది. ఇప్పుడు NMCకి మరో ప్రశ్న అడుగుతోంది. “ఈ AI Content ఉద్దేశం ఏమిటి?” . AI-generated లేదా AI-assisted contentలో Promotional Character ఉంటే అది కూడా Advertising పరిధిలోకి వస్తుంది. అంటే AI ఒక loophole కాదు.
రేపు ఒక డాక్టర్ AI Avatarతో “ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా ఫలితం వస్తుంది” అని చెప్పించినా, దాన్ని “AI చెప్పింది, నేను కాదు” అంటూ తప్పించుకోలేరు. Influencer వెనుక దాక్కోవడం కూడా కుదరదు ఇక మరో కొత్త Reality.
ఒక డాక్టర్ స్వయంగా Advertisement చేయకపోవచ్చు. బదులుగా ఒక Influencerకు డబ్బులు ఇచ్చి Clinic గురించి Reel చేయించవచ్చు. డాక్టర్ అకౌంట్లో ఏమీ ఉండదు. Influencer అకౌంట్లో మాత్రమే ఉంటుంది. NMC ఈ దారిని కూడా గుర్తించింది. కండీషన్స్ పెట్టింది.
Advertising Agency అయినా, Influencer అయినా, Digital Platform అయినా — ఒక Doctor లేదా Hospital ఆ Promotionను Authorise, Commission, Sponsor లేదా Knowingly Permit చేస్తే బాధ్యత నుంచి పూర్తిగా తప్పించుకోలేరు.
అంటే Digital Marketing Agency వెనుక దాక్కోవడం అంత ఈజీ కాదు. “నేను చేయలేదు.. నా Agency చేసింది” అనేది ఇప్పుడు సరైన సమాధానం కాకపోవచ్చు.
అయితే డాక్టర్లు ఇక Instagramలో పోస్టులు చేయకూడదా?
చేయొచ్చు. డాక్టర్ Diabetes గురించి చెప్పొచ్చు. Heart Attack లక్షణాలు వివరించొచ్చు. Vaccinationపై అవగాహన కల్పించొచ్చు. Mental Health, Nutrition, Public Health గురించి Educational Content చేయొచ్చు. Academic Discussionsలో పాల్గొనొచ్చు. NMC Social Mediaను మూసేయడం లేదు.
అది కేవలం ఒకటే అడుగుతోంది: మీరు ప్రజలకు సమాచారం ఇస్తున్నారా? లేక మీ దగ్గరకు పేషెంట్లను రప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారా? రెండింటి మధ్య గీత చాలా పలుచగా ఉంటుంది.
ఒక Reel మొదట “Heart Attack లక్షణాలు ఇవి” అని మొదలై, చివరికి “ఇలాంటి సమస్య ఉంటే మా Hospitalలో Appointment తీసుకోండి” అని ముగిసినప్పుడు.. అది ఎక్కడ Education నుంచి Marketingగా మారిందన్నదే అసలు Challenge.
ఏదైమైనా…
ఇకపై ఒక Medical Reel కనిపించినప్పుడు కేవలం “డాక్టర్ బాగా మాట్లాడుతున్నారు” అని నమ్మడం కంటే కొన్ని ప్రశ్నలు మనమే వేసుకోవాలి. ఈ వ్యక్తి చెప్పేది Medical Evidence ఆధారంగా ఉందా? “100%”, “Guaranteed”, “Best”, “Permanent” వంటి Marketing Words ఉన్నాయా? ఒక పేషెంట్ Success Storyను నన్ను ఆకర్షించడానికి ఉపయోగిస్తున్నారా? Before & After ఫొటోలు నిజమైన Clinical Evidenceనా? Influencer Paid Promotion చేస్తున్నాడా? AIతో తయారైన Contentను నిజమైన పేషెంట్ లేదా నిజమైన Medical Resultలా చూపిస్తున్నారా?
ఈ ప్రశ్నలు ముఖ్యమైనవి. ఎందుకంటే సోషల్ మీడియాలో నమ్మకం కూడా ఒక Commodityగా మారిపోయింది. అసలు మారుతున్నది డాక్టర్ Instagram కాదు.. మన నమ్మకం.








