స్కూల్ పిల్లలకు తానా మిడ్-అట్లాంటిక్ విభాగం చేయూత
స్కూల్ బ్యాగులు, ఇతర వస్తువుల పంపిణీ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్-అట్లాంటిక్ విభాగం వారు స్కూల్ పిల్లలకోసం నిర్వహించిన కార్యక్రమం విజయవంతమైంది. స్థానిక కమ్యూ నిటీకి తమవంతుగా సహాయం చేసేందుకు కోసం తానా ప్రతిఏటా గివింగ్ బ్యాక్ టు ది కమ్యూనిటీ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తోంది. అందులో భాగంగా తమతమ ప్రాంతాల్లో ఉన్న స్కూల్ పిల్లలకు బ్యాక్ ప్యాక్ పేరుతో వారికి అవసరమైన బ్యాగ్, ఇతర వస్తువులను అందజేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా హ్యారీస్బర్గ్ లోని డౌనీ స్కూల్ విద్యార్థులకు బ్యాగులు, వస్తువులను విరాళంగా అందించింది. నూతన విద్యా సంవత్సరాన్ని ఆనందంగా ప్రారంభించాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సేవా కార్యక్రమానికి నాయకత్వం వహించి, తమ మద్దతు అందించిన తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి మరియు తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి గారికి మిడ్ అట్లాంటిక్ విభాగం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది.
ఇవి కూడా చదవండి
తానా ఈవీపీ శ్రీనివాస్ లావు, కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని, తానా బెనిఫిట్స్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు, తానా మిడ్-అట్లాంటిక్ రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కంతేటి ఈ కార్యక్రమం విజయవంతమయ్యేలా కృషి చేశారు. ఈ కార్యకమానికి తోడ్పడిన వలంటీర్లకు, ఆర్థిక సహాయం అందించిన మా గ్రాండ్ స్పాన్సర్లు షిన్టెక్ ఇంక్ మరియు బ్రైట్ రేట్ మోర్ట్గేజ్ ఎలఎల్సి కి నిర్వాహకులు మిడ్ అట్లాంటిక్ టీమ్ ధన్యవాదాలు తెలియజేసింది.








