నాని సినిమాలో రుక్మిణి వసంత్.. ప్రేమకథకు క్రేజీ కాంబినేషన్!
నేచురల్ స్టార్ నాని(Nani) తన నెక్ట్ప్ ప్రాజెక్టుల విషయంలో స్పీడ్ పెంచుతున్నారు. విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన, తాజాగా 96 ఫేమ్ ప్రేమ్ కుమార్(prem kumar) దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి డిస్కషన్స్ జరుగుతుండగా, ఇప్పుడు హీరోయిన్ సెలెక్షన్ కూడా పూర్తయినట్లు సమాచారం. ఏషియన్ సునీల్(Asian Suneel) నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమా లవ్ స్టోరీతో పాటూ ఎమోషన్స్ కు ప్రాధాన్యమిచ్చే ఎంటర్టైనర్గా రూపొందనుంది. నెక్ట్స్ ఇయర్ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది.
ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండటంతో మేకర్స్ ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా కన్నడ నటి రుక్మిణి వసంత్(rukmini vasanth)ను నాని(nani) సరసన హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కథలో ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యం ఉండటంతో ఈ కాంబినేషన్‌పై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కొనసాగుతున్నాయని, త్వరలోనే సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడే అవకాశం ఉందని సమాచారం. తక్కువ టైమ్ లో షూటింగ్ పూర్తి చేసేలా నాని ప్లాన్స్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, నాని అక్టోబర్ 17 నుంచి సుజీత్(Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కనున్న బ్లడీ రోమియో(bloody romeo) షూటింగ్ ను న్యూఢిల్లీలో ప్రారంభించనున్నారు. ఈ సినిమాను వచ్చే సమ్మర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇక ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో ఫహాద్ ఫాజిల్(Fahad Faazil) నటించిన మరో సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. ఆ సినిమా ఈ ఇయర్ డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి నాని, ప్రేమ్ కుమార్ కాంబినేషన్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.








