యష్ తో మిత్రన్ అడ్వెంచర్ మూవీ..
కేజీఎఫ్(KGF) ఫ్రాంచైజ్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ స్టార్ యష్(Yash) తర్వాతి సినిమాలపై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ సాగుతోంది. కోలీవుడ్ డైరెక్టర్ పీఎస్ మిత్రన్(PS Mitran)తో ఆయన ఓ అడ్వెంచర్ మూవీ చేసే అవకాశాలున్నాయనే ప్రచారం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలోనే యష్ కు మిత్రన్ ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీని వినిపించారట. ఇండియానా జోన్స్ తరహాలో సాగే సాహసాలతో పాటు స్ట్రాంగ్ ఎమోషనల్ డ్రామా ఈ కథలో మెయిన్ ఎట్రాక్షన్ గా ఉంటుందని సమాచారం. అయితే అప్పట్లో డేట్స్ ఇష్యూ కారణంగా ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదని తెలుస్తోంది. ఇప్పుడు మరోసారి ఈ కథను పట్టాలెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇదే టైమ్ లో ధనుష్(Dhanush)తో మిత్రన్ ఓ హిందీ సినిమా చేయనున్నారనే వార్తలు తెరపైకి రావడంతో గందరగోళం మొదలైంది. సంజయ్ లీలా భన్సాలీ(Sanjay leela bhansali) నిర్మాణంలో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌లో కరీనా కపూర్ ఖాన్(kareena kapoor khan) కూడా నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మైథలాజికల్ జంగిల్ అడ్వెంచర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా విషయంలో డిస్కషన్స్ జరుగుతున్నాయని మిత్రన్ గతంలో వెల్లడించినప్పటికీ, ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ధనుష్ ప్లస్ యష్ నటించనున్నారనే ఊహాగానాలకు ప్రస్తుతానికి ఆధారాలు లేవు. ఈ రెండు ప్రాజెక్టులు వేర్వేరని అంతా భావిస్తున్నారు. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తేనే పూర్తి క్లారిటీ రానుంది. ప్రస్తుతం యష్, రామాయణ(ramayana) సినిమాతో బిజీగా ఉండగా, ఈ మైథలాజికల్ డ్రామా ఫస్ట్ పార్ట్ ఈ దీపావళికి రిలీజ్ కానుంది.








