హృతిక్ ఆ సినిమాను రిజెక్ట్ చేసింది ఎందుకంటే?
నితేశ్ తివారీ(nitesh tiwari) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక సినిమా రామాయణ(ramayana) ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రణ్‌బీర్ కపూర్(Ranbir kapoor) శ్రీరాముడిగా, సాయి పల్లవి(Sai Pallavi) సీతాదేవిగా నటిస్తున్న ఈ సినిమాలో రావణుడి పాత్రకు యష్(Yash) ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే, మొదట ఈ కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్(Hrithik Roshan) పేరును కూడా పరిశీలించినట్లు సమాచారం. తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు వైవిధ్యమైన పాత్రలను పోషించగల సామర్థ్యం ఉన్న హృతిక్‌ను రావణుడి పాత్రలో చూపించాలని చిత్ర బృందం భావించినట్లు తెలుస్తోంది. కానీ, కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు.
అయితే రావణుడి పాత్రను హృతిక్ రిజెక్ట్ చేయడం వెనుక ఆయన ఎంచుకునే పాత్రల విషయంలో అనుసరిస్తున్న ప్రత్యేక దృక్పథం ఉన్నట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో వార్(war) సినిమాలో గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో, విక్రమ్ వేదా(Vikram veda)లో యాంటీ హీరో తరహా పాత్రలో కనిపించిన ఆయన, మరోసారి ప్రతికూల ఛాయలున్న పాత్రను ఎంచుకోవడానికి ఆసక్తి చూపలేదని సమాచారం. ఒకే తరహా పాత్రల్లో కనిపించకుండా, తన యాక్టింగ్ లో కొత్త యాంగిల్స్ ను ఆవిష్కరించే కథలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నది ఆయన ఆలోచనగా తెలుస్తోంది.
ఇక రావణుడి క్యారెక్టర్ ను అంగీకరించిన యష్, ఆ క్యారెక్టర్ లోని విభిన్న పార్శ్వాలను స్క్రీన్‌పై ఆవిష్కరించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. కేవలం విలన్ గానే కాకుండా, అనేక ఎమోషన్స్, సంక్లిష్టతలు కలిగిన వ్యక్తిగా రావణుడిని చూపించడమే ఈ క్యారెక్టర్ లో ప్రత్యేకత కానుంది. భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా రూపొందుతున్న రామాయణ తొలి భాగాన్ని 2026 నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సిద్ధమవుతోంది.








