ఆస్టిన్ హిందూ టెంపుల్ ఆధ్వర్యంలో ‘‘రాంలీల’’ రంగస్థల ప్రదర్శన
ఆస్టిన్ హిందూ టెంపుల్, కమ్యూనిటీ సెంటర్ ఆధ్వర్యంలో దసరా దీపావళి 2026 మేళాను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రేక్షకుల కోరిక మేరకు రాంలీల అన్న దానిని రంగస్థల ప్రదర్శనగా ఇవ్వున్నారు. ఇవి కేవలం రెండు ప్రదర్శనలు మాత్రమే వుంటాయని ట్రస్టీ ప్రకటించింది. ఆసక్తి వున్న వారందరూ వెంటనే సీట్లను ముందుగానే బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఇక.. బుక్ చేసుకున్న వారు ప్రదర్శనకు కనీసం 15 నిమిషాల ముందే వుండాలని ,లేదంటే ఇతరులకు ఆ సీట్లను కేటాయిస్తామని కూడా నిర్వాహకులు ప్రకటించేధారు. అలాగే ప్రదర్శన ప్రారంభమైన తరువాత బయటికి వెళ్లడం, లోపలికి ప్రవేశం కూడా వుండదని ప్రకటించారు.
ఇందులో భాగంగా ఈ నెల 24 న మొదటి ప్రదర్శన సాయంత్రం 5:55 కి ప్రారంభం అవుతుందని, 6:10 కల్లా డోర్స్ క్లోస్ అవుతాయని నిర్వాహకులు ప్రకటించారు. ఇక రెండో ప్రదర్శన రాత్రి 7:10 గంటలకు ప్రారంభం అవుతుందని, డోర్స్ 7:25 కల్లా క్లోస్ చేస్తామని ప్రకటించారు.షో జరుగుతున్నంత సేపూ ఫోటోలు తీయడాలు, వీడియోలు తీయడాలు నిషేధమని కూడా ప్రకటించారు.








