ఏపీలో రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ .. ప్రారంభమైన ఎన్నికల సామగ్రి పంపిణీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ పోలింగ్ (Municipal Polling) కోసం ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల విధుల్లో (Election Duties) ఉన్న సిబ్బంది (Staff) సామగ్రి పంపిణీ కేంద్రాలకు చేరుకుంటున్నారు. యంత్రాంగం ఎన్నికల సామగ్రి పంపిణీని పర్యవేక్షిస్తోంది. నగరపాలక, పురపాలిక, నగర పంచాయతీల్లో ఆదివారం (Sunday) పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 3న ఫలితాలు వెల్లడించనున్నారు.








