డిసెంబర్ లో తేజ సజ్జా డెస్టినేషన్ వెడ్డింగ్
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా(Teja Sajja) లైఫ్ లో కొత్త అధ్యాయం మొదలైంది. మౌర్యతో ఆయన ఎంగేజ్మెంట్ హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ(Taj Krishna) హోటల్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రత్యేకంగా హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు. తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మంత్రి సీతక్క, హరీశ్ రావు, గంటా శ్రీనివాసరావు తదితర రాజకీయ ప్రముఖులు సందడి చేశారు.
టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని తేజ సజ్జాకు శుభాకాంక్షలు తెలిపారు. కె. రాఘవేంద్రరావుతో పాటు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, టీజీ విశ్వప్రసాద్ వంటి నిర్మాతలు హాజరయ్యారు. రవితేజ, నాని, రానా దగ్గుబాటి, అడివి శేష్, శ్రీకాంత్, సుధీర్ బాబు తదితర నటీనటులు ఈ ఎంగేజ్మెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. అనిల్ రావిపూడి, ప్రశాంత్ వర్మ, శివ నిర్వాణ, మారుతి, నందినీ రెడ్డి సహా పలువురు డైరెక్టర్లు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి, హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా.. ముఖ్యంగా సూపర్ హీరో సినిమాలతో ఆడియన్స్ కు మరింత చేరువయ్యారు. కెరీర్ పరంగా మంచి గుర్తింపు అందుకుంటున్న టైమ్ లో ఆయన వ్యక్తిగత జీవితంలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. డిసెంబర్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ద్వారా తేజ, మౌర్య వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. పెళ్లికి సంబంధించిన మరిన్ని వివరాలను కుటుంబ సభ్యులు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.







