రెండు భాగాలుగా రానున్ ఎన్టీఆర్ డ్రాగన్?
యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prasanth Neel) కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ డ్రాగన్(Dragon)పై రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పటికే అనుకున్న టైమ్ కంటే ఏడాది ఆలస్యమైంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా విషయంలో మరో ఇంట్రెస్టింగ్ డెసిషన్ తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కథా పరిధి, నిడివి, భారీ నిర్మాణ వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
ఈ ప్రచారం ప్రకారం డ్రాగన్ ఫస్ట్ పార్ట్ ను 2027 జూన్‌లో రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకోగా, సెకండ్ పార్ట్ 2028లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడలేదు. సరైన టైమ్ లో పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. మరోవైపు గాయం నుంచి పూర్తిగా కోలుకున్న ఎన్టీఆర్ రీసెంట్ గానే తిరిగి షూటింగ్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతుండగా.. ఎన్టీఆర్, రుక్మిణి వసంత్(Rukmini vasanth)లపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఈ సినిమాలో అనిల్ కపూర్(Anil Kapoor), బిజు మీనన్(Biju menon), ఆశుతోష్ రాణా(Asutosh rana), ఖుష్బూ(Kushboo) తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కేజీఎఫ్ ఫ్రాంచైజ్ సినిమాలకు వర్క్ చేసిన టాలెంటెడ్ టెక్నికల్ టీమ్ ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తోంది. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తుంది. రెండు పార్ట్ ల రిలీజ్ పై వస్తున్న వార్తలు నిజమైతే, ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరగడం ఖాయం.







