RC17 కోసం రామ్ చరణ్‌తో భారీ కసరత్తు.. సుకుమార్ ప్లాన్ ఏంటి!
పెద్ది సినిమా కోసం భారీగా మేకోవర్ అయిన రామ్ చరణ్(ram charan) ఇప్పుడు తన తర్వాతి ప్రాజెక్ట్ RC17 కోసం మరోసారి కొత్త ట్రాన్స్ఫర్మేషన్కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ సుకుమార్(sukumar)తో తెరకెక్కనున్న ఈ సినిమా క్యారెక్టర్ కోసం చరణ్ తన ఫిజిక్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే స్పెషల్ డైట్‌తో పాటు వర్కౌట్ రొటీన్‌ను ప్రారంభించినట్లు టాలీవుడ్ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది.
ఇవి కూడా చదవండి
అయితే ఈ జర్నీకి ముందు చరణ్(charan) పూర్తిగా కోలుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెద్ది షూటింగ్ టైమ్ లో కుడి మణికట్టుకు అయిన గాయం తీవ్రం కావడంతో జూలైలో కోయంబత్తూరులో సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. డాక్టర్ల సూచన మేరకు కొంతకాలం విశ్రాంతి తీసుకుని, మళ్లీ ఫిట్నెస్ పూర్తి చేసిన తర్వాతే ఆయన తిరిగి ప్రొఫెషనల్ కమిట్మెంట్స్పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు RC17 కోసం సుమారు ఎనిమిది కిలోల వరకు బరువు తగ్గే టార్గెట్‌తో చరణ్ రెడీ అవుతున్నారనే ప్రచారం వినిపిస్తోంది.
పెద్ది(Peddi) లుక్కు పూర్తిగా భిన్నంగా ఈ సినిమాలో చరణ్ కనిపించనున్నారని సమాచారం. క్యారెక్టర్ కోసం లాంగ్ హెయిర్‌తో పాటు కొత్త బాడీ లాంగ్వేజ్‌ను కూడా సుకుమార్ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్స్ పూర్తిచేసిన సుకుమార్ ప్రీ ప్రొడక్షన్లో బిజీగా ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers), సుకుమార్ రైటింగ్స్(Sukumar Writings) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను డిసెంబర్లో సెట్స్‌పైకి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.








