త్రిషలాంటి హీరోయిన్ ఇండస్ట్రీలో చాలా అరుదు.. మాళవిక ప్రశంసలు!
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య పోటీ ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం తరచూ వినిపిస్తూ ఉంటుంది. అయితే, ఆ పోటీకి భిన్నంగా కో యాక్టర్ల సక్సెస్ను మనస్ఫూర్తిగా అభినందించే వ్యక్తిత్వాలు కూడా ఉంటాయని నటి మాళవికా మోహనన్(Malavika Mohanan) తాజా కామెంట్స్ మరోసారి గుర్తు చేశాయి. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ త్రిష(Trisha) తన కెరీర్లో చూపించిన ఆప్యాయత, కొత్త నటీనటుల పట్ల ఆమె వ్యవహరించే తీరు తనకు ఎంతో ప్రత్యేకంగా అనిపించిందని మాళవిక వెల్లడించారు.
తన సినీ కెరీర్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు రజనీకాంత్(Rajinikanth) నటించిన పేట(Petta) మూవీలో అవకాశం రావడం తనకు పెద్ద బ్రేక్ అయినప్పటికీ, కమర్షియల్ సినిమాల ఎక్స్పీరియెన్స్ లేక కొంత ప్రెజర్ కు గురైనట్లు ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ టైమ్లో వారణాసిలో జరిగిన షూటింగ్లో త్రిషతో కలిసి నటించే అవకాశం రావడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడిందన్నారు. సాధారణంగా తమ వర్క్ తోనే పరిమితమయ్యే వారితో పోలిస్తే, త్రిష మాత్రం కొత్తవారిని కూడా ఆప్యాయంగా పలకరించి, వారికి ధైర్యం చెప్పే వ్యక్తి అని మాళవిక ప్రశంసించారు.
ఆ తర్వాత విజయ్(Vijay) సరసన మాస్టర్(Master) మూవీలో ఛాన్స్ దక్కినప్పుడు త్రిష స్వయంగా మెసేజ్ చేసి అభినందించడం తనను ఎంతో ఆనందానికి గురి చేసిందని మాళవిక తెలిపారు. ఎదుగుతున్న కో యాక్ట్రెస్ ను ఎంకరేజ్ చేయడానికి నిజంగా చాలా పెద్ద మనసు అవసరమని, ఆ క్వాలిటీ త్రిషలో పుష్కలంగా ఉందని అన్నారు. ప్రస్తుతం కార్తీ(Karthi)తో కలిసి నటించిన సర్దార్2(Sardar2) రిలీజ్ కు రెడీ అవుతున్న వేళ, మాళవిక చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో త్రిష వ్యక్తిత్వంపై మరోసారి చర్చకు దారితీశాయి.








