ఆన్లైన్ లో గణేశ్ మండపాల నమోదు తప్పనిసరి : సీపీ సజ్జనార్
హైదరాబాద్ నగరంలో గణేశ్ మండపాల (Ganesh Mandapam)కు తప్పనిసరిగా ఆన్లైన్ (Online)లో నమోదు చేయాలని సీపీ సజ్జనార్ (CP Sajjanar) స్పష్టం చేశారు. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా, గణేశ్ మండపాల వివరాలను ఉత్సవ నిర్వాహకులు ముందస్తుగానే policeportal.tspolice.gov.in/index.htm లో రిజిస్ట్రేషన్ (Registration) చేసుకోవాలని సూచించారు. ముందుగా సమాచారం ఇస్తే ఆయా ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు, భద్రతా ఏర్పాట్లకు నిమజ్ఞనం, ట్రాఫిక్ క్రమబద్దీకరణకు పోలీసు యంత్రాంగానికి సులువవుతుందన్నారు.








