కేసీఆర్ ఫాంహౌస్ ముట్టడి … ఎర్రవల్లిలో తీవ్ర ఉద్రిక్తత
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి (Erravalli)లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేసీఆర్(KCR) ఫామ్‌హౌస్ వద్ద డప్పుల మోతకు కాంగ్రెస్ పార్టీ (Congress party) పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి వచ్చి డప్పులు మోగిస్తూ నిరసన తెలిపేందుంకు ప్రయత్నించారు. నర్సారెడ్డి (Narsa Reddy) ఆధ్వర్యంలో వరదరాజపూర్ మీదుగా కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలోకి కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకెళ్లారు. ఎక్కడికక్కడ కాంగ్రెస్ శ్రేణులను బారికేడ్లు,రోప్ పార్టీతో పోలీసులు నిలువరించారు. దీంతో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. కొందరు కార్యకర్తలు బారికేడ్లను తోసుకుని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు అర కిలోమీటరు దగ్గర్లోకివెళ్లి డప్పుల మోతతో నిరసన తెలిపారు. పోలీసులు (Police) స్పందించి వెంటనే నిరసనకారులను వెనక్కి తీసుకొచ్చారు. ఆందోళనకారులను అదుపు చేసే క్రమంలో పలువురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. ఒక దశలో డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి బారికేడ్లు తోసుకుని ఫాంహౌస్ వైపునకు పరుగులు తీశారు.








