ఎమ్మెల్సీ తాతా మధు అరెస్టు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు (Tata Madhu)ను న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని అతని నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు మరో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి (Naveen Kumar Reddy)ని కోకాపేటలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ (Gaddam Prasad Kumar)ను కులం పేరుతో పాటు, అసభ్య పదజాలతో దూషించారని స్పీకర్ ఓఎస్డీ పొల్లెపల్లి వెంకటేశం (Pollepalli Venkatesham) ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాతా మధుపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు. అరెస్టు అనంతరం తాతా మధు, నవీన్ రెడ్డిని నారాయణగూడ పీఎస్‌కు తరలించారు.








