తెలంగాణ స్పీకర్ ప్రసాద్‌కుమార్ కంటతడి
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) కంటతడి పెట్టుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు (Tata Madhu) వ్యాఖ్యలను ఖండిస్తూ శాసన సభలో మంత్రి సీతక్క (Seethakka) మాట్లాడారు. స్పీకర్ (Speaker) తల్లిని అవమానించడం బాధాకరమన్నారు. ఈ సమయంలో స్పీకర్ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలు బాధాకరమని స్పీకర్ అన్నారు. శాసన సభ వాయిదా పడిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సీతక్క ఐదేళ్లుగా నాకు రాఖీ (Rakhi) కడుతున్నారు. సభలో ఆమె కన్నీరు పెట్టుకుంటేనాకు దుఖం ఆగలేదు. తాతా మధు వ్యాఖ్యలపై శాసనసభ తీర్మానం చేసి మండలికి పంపిస్తా అని తెలిపారు.








