కుప్పకూలిన ఐఏఎస్ పీఎస్ .. సీపీఆర్ చేసిన మంత్రి వాకిటి శ్రీహరి
తెలంగాణ సచివాలయ ఉద్యోగి రాజు (Raju) ఆకస్మిక మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. తెలంగాణ సచివాలయంలో ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ నవీన్ మిత్తల్ ( Naveen Mittal) వ్యక్తిగత కార్యదర్శి ( పీఎస్) గా విధులు నిర్వహిస్తున్న రాజు ఆకస్మికంగా మృతి చెందారు. అసెంబ్లీ ప్రాంగణంలో విధి నిర్వహణలో ఉండగా రాజు ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే స్పందించిన మంత్రి వాకిటి శ్రీహరి (Minister Vakiti Srihari) ఆయనకు సీపీఆర్ (CPR) చేసి, ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పల్స్ పడిపోవడంతో అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. రాజు అకాల మరణం పట్ల సచివాలయ ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.








