“అంతా రాములోరు చూస్కుంటారు” సినిమా హీరోయిన్ అనస్వర రాజన్ బర్త్ డే పోస్టర్
యంగ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా “అంతా రాములోరు చూస్కుంటారు”. ఈ చిత్రంలో అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీమతి శ్రావణి సమర్పణలో ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్, వి.జి.బి. ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని, న్యూ యాస్పరెంట్ ప్రొడ్యూసర్ గిరిబాబు వల్లభనేని నిర్మిస్తున్నారు. ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరీతో టాలెంటెడ్ డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ రూపొందిస్తున్నారు. లక్ష్మీ భూపాల్ రైటర్ గా వ్యవహరిస్తున్నారు.
ఈ రోజు బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ అనస్వర రాజన్ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విశెస్ తెలియజేస్తూ మేకర్స్ “అంతా రాములోరు చూస్కుంటారు” సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో శిరీష పాత్రలో అనస్వర పర్ ఫార్మెన్స్ ప్రేక్షకుల్ని అలరించబోతోంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, పర్ ఫార్మెన్స్ గురించి ఇటీవల టైటిల్ గ్లింప్స్ ఈవెంట్ లో చిత్రబృందం ప్రశంసిస్తూ మాట్లాడారు. అనస్వరకు ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకురానుంది.








