అయ్యగారు ట్యాగ్ కు అన్నీ హక్కులూ నాకే ఉన్నాయి
అక్కినేని ఫ్యామిలీలో అఖిల్(Akhil)కు ఫ్యాన్స్ పెట్టిన అయ్యగారు ట్యాగ్ సోషల్ మీడియాలో ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే. అయితే తాజాగా ఈ ట్యాగ్ పై మరో అక్కినేని హీరో సుమంత్(sumanth) సరదాగా తనకే హక్కుందని అనౌన్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. తన తాజా సినిమా మహేంద్రగిరి వారాహి(Mahendragiri Vaarahi) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అఖిల్ చీఫ్ గెస్ట్ గా పాల్గొనగా, ఫ్యాన్స్ అయ్యగారు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రెస్పాండ్ అయిన సుమంత్.. ఫ్యామిలీలో పెద్ద మనవడిని తానే కాబట్టి ఆ ట్యాగ్ తనకే సరిపోతుందని చమత్కరించారు.
అయితే ఈ సరదా కామెంట్స్ వెనుక సుమంత్- అఖిల్ మధ్య ఉన్న బాండింగ్ కూడా స్పష్టంగా కనిపించింది. తన సినిమా కోసం అఖిల్ రావడంపై సంతోషం వ్యక్తం చేసిన సుమంత్, ఇటీవల వచ్చిన లెనిన్(lenin)లో అఖిల్ యాక్టింగ్ ను ప్రత్యేకంగా ప్రశంసించారు. ముఖ్యంగా సినిమా చివరి భాగంలో కథను తన భుజాలపై మోసిన తీరు అఖిల్‌లో వచ్చిన యాక్టింగ్ మెచ్యూరిటీకి నిదర్శనమని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
అఖిల్ సక్సెస్ సాధిస్తే నిజంగా ఆనందించే ఫ్యామిలీ మెంబర్స్ లో తాను ముందుంటానని సుమంత్ చెప్పడం అభిమానులను ఆకట్టుకుంది. రెండోసారి సినిమా చూసినప్పుడు అఖిల్ యాక్టింగ్ లోని కొన్ని కొత్త కోణాలు మరింత స్పష్టంగా కనిపించాయని వెల్లడించారు. ఇక సుమంత్ హీరోగా వస్తున్న మహేంద్రగిరి వారాహి ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుండటంతో, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇద్దరు అక్కినేని హీరోల మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.








