ఈ నెల 11న హీరో ప్రియదర్శి మూవీ “ఇడుపు కాయితం”
ప్రొడ్యూసర్ బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తమ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రియదర్శి హీరోగా నిర్మిస్తున్న సినిమా “ఇడుపు కాయితం”. ఈ సినిమాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తోంది. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎంటర్ టైనింగ్ డ్రామాగా “ఇడుపు కాయితం” సినిమాను యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి రూపొందిస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా నుంచి ‘శ్రీలత..’ సాంగ్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ నెల 11న ‘శ్రీలత..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఇటీవల హీరో ప్రియదర్శి పుట్టినరోజు సందర్భంగా ‘శ్రీలత..’ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఈ పాట వైరల్ గా మారి మ్యూజిక్ లవర్స్ కు ఫేవరేట్ సాంగ్ అయ్యింది. ఈ పాట ఫుల్ వెర్షన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటూ సోషల్ మీడియా వేదికగా ఆడియెన్స్ అడుగుతూ వస్తున్నారు. మ్యూజిక్ లవర్స్ లో హీరోయిన్ నాగదుర్గకు ఉన్న ఫాలోయింగ్ కూడా ఈ పాటపై క్రేజ్ పెంచింది. ప్రేక్షకుల కోరిక మేరకు ఈ రోజు మేకర్స్ ‘శ్రీలత..”శ్రీలత..’ పాటను ఈ నెల 11న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మంచి మెలొడీ ట్యూన్ తో ఈ పాటను బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు.
“ఇడుపు కాయితం” సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను డిసెంబర్ ఫస్ట్ వీక్ లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.








