“రోమాంచకం” విజయంతో మా బ్యానర్ లో మరో సూపర్ హిట్ చేరింది – ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన సినిమా “రోమాంచకం”. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన “రోమాంచకం” సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలోని ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపిన ఎలిమెంట్స్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో “రోమాంచకం” సినిమా బ్లాక్ బస్టర్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
లిరిక్ రైటర్ రజిత మాట్లాడుతూ – నేను తమిళంలో సాంగ్స్ రాస్తుంటాను. కొన్ని తమిళ డబ్బింగ్ మూవీస్ కు లిరిక్స్ అందించాను. తెలుగులో నేను పాటలు రాసిన ఫస్ట్ స్ట్రైట్ ఫిలిం రోమాంచకం. నేను తెలుగులో రాసిన మొదటి పాటకు డైరెక్టర్ వేణుగోపాల్ గారు ఫస్ట్ లైన్ రాశారు. ఈ మూవీకి వర్క్ చేయడం బ్యూటిఫుల్ ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. అన్నారు.
డైలాగ్ రైటర్ మీరక్ మాట్లాడుతూ – డైరెక్టర్ వేణు అన్నలోని ఎనర్జీనే మూవీలో కనిపించింది. ఆయన ఏ సీన్స్ కు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని నమ్మారో ఆ సీన్స్ కు ఆడియెన్స్ బాగా నవ్వుతున్నారు. మా మూవీకి మంచి విజయాన్ని అందించిన ఆడియెన్స్ కు థ్యాంక్స్ చెబుతున్నాం. అన్నారు.
యాక్టర్ సోహాన్ మాట్లాడుతూ – మా మూవీని ప్రేక్షకులు థియేటర్స్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పర్ ఫార్మెన్స్, క్యారెక్టర్స్ అన్నీ జెన్యూన్ గా ఉన్నాయంటూ థియేటర్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్లు చెప్పడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. తెలుగు ప్రేక్షకులకు మాత్రమే మూవీస్ మీద ఇలాంటి లవ్, అభిరుచి ఉంటాయి. తెలుగు యాక్టర్ గా ఉన్నందుకు గర్వపడుతున్నా. అన్నారు.
యాక్టర్ నరేంద్ర రవి మాట్లాడుతూ – మేము గత వారం చాలా థియేటర్స్ విజిట్ చేస్తూ వచ్చాం. ప్రతి థియేటర్ లో ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేయడం చూశాం. సినిమాలోని హిలేరియస్ ఫన్ కు సీట్లు ఊగేలా నవ్వుతున్నారు. మా సినిమాకు ఇంతగా ఆదరణ చూపిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. నాకు ఈ మూవీలో అవకాశం దక్కడం చాలా సంతోషంగా భావిస్తున్నా. అన్నారు.
యాక్టర్ వెంకటేష్ కాకుమాను మాట్లాడుతూ – మా రోమాంచకం సినిమాను లవ్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మేము థియేటర్స్ విజిట్స్ లో చూశాం. మేము ఎక్స్ పెక్ట్ చేసిన దానికంటే పది రెట్లు మా సినిమాను ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. వేణు అన్న ఈ కథ చెప్పినప్పుడే మనం కొత్తగా ట్రై చేస్తున్నాం అన్నాడు. ఆయనను బ్లైండ్ గా నమ్మి సినిమా చేశాం. మా మూవీలో హీరో హీరోయిన్స్ కంటే మా బాయ్స్ మధ్య సీన్స్ కే ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. మా మూవీని మరింతగా సపోర్ట్ చేయాలని కోరుతున్నా. అన్నారు.
డైరెక్టర్, యాక్టర్ అనుదీప్ కేవీ మాట్లాడుతూ – డైరెక్టర్ వేణుగోపాల్ లో ఒక యూనిక్ కామెడీ టైమింగ్ ఉంటుంది. ఈ కథ చెప్పినప్పుడు చాలా ఫన్ ఫీలయ్యా. సినిమాలో కూడా చాలా సీన్స్ లో ఆ యూనిక్ కామెడీ మీకు కనిపిస్తుంటుంది. థియేటర్స్ కు వచ్చి రోమాంచకం మూవీ చూడండి. మీకొక డిఫరెంట్ ఎక్సిపీరియన్స్ ఇస్తుంది. అన్నారు
డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ – మా మూవీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. సందీప్ అన్న , ప్రణయ్ అన్న ఈ మూవీకి అవకాశం ఇచ్చినప్పుడు నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. నేను అంతా కొత్త వాళ్లతోనే వెళ్లాలని డిసైడ్ అయ్యి ఒక కన్విక్షన్ తో ఈ సినిమా చేశా. మా టెక్నీషియన్స్ ప్రతి క్రాఫ్ట్ ను అందంగా తీర్చిదిద్దారు. నేను వర్క్ షాప్స్ పెట్టినా.. ప్రతి నటుడు ఆ క్యారెక్టర్ లోని సోల్ ను తీసుకుని సూపర్బ్ గా పర్ ఫార్మ్ చేశారు. ఈ రోజు థియేటర్స్ లో వస్తున్న అప్లాజ్ అంతా వాళ్లకే చెందాలి. అంత బాగా సెటిల్డ్ గా నటించారు. సుమంత్ ఈ క్యారెక్టర్ ను బాగా పర్ ఫార్మ్ చేయగలను అని కంప్లీట్ గా నమ్మి ఆయనను తీసుకున్నాను. సుమంత్ ప్రభాస్ హీరోగా మంచి స్థాయికి వెళ్తాడు. సినిమా తీసినం వాళ్లం హ్యాపీగా ఉన్నాం, చూసే ఆడియెన్స హ్యాపీగా ఉన్నారు. ప్రేక్షకులే మాకు బ్లాక్ బస్టర్ ఇచ్చారు. థియేటర్స్ లో ఫ్యామిలీస్ అంతా మా మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే సంతోషంగా అనిపించింది. అదే నాకు రోమాంచకం ఫీల్.
హీరో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ – ఇందాక మా డైరెక్టర్ వేణు గోపాల్ అన్న ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ క్రెడిట్ మాకు ఇచ్చారు గానీ మేము ఆయన ఆలోచనలే మేము రిఫ్లెక్ట్ చేశాం. అందుకే మా నుంచి అంతమంచి పర్ ఫార్మెన్స్ వచ్చింది. మేము ఈ సినిమా చేస్తున్నప్పుడు ఎలా ఎంజాయ్ చేశామో, ఆడియెన్స్ కూడా సినిమా చూస్తున్నప్పుడు అంత బాగా ఎంజాయ్ చేయాలని కోరుకున్నాం. మేము కోరుకున్నట్లే థియేటర్స్ లో ప్రేక్షకులు బాగా నవ్వుకుంటున్నారు. నువ్వు ఇంత నవ్విస్తావని తెలియదు అని మా ఫ్రెండ్స్ అంటున్నారు. ఈ సినిమా వల్ల ప్రభాస్ అన్నను కలిశా. ఈ సినిమా నాకు అన్ని రకాలుగా చాలా స్పెషల్ మూవీ. మా సినిమా చూసి మీరు నవ్వుకున్నామని రియల్ గా అనుకుంటే మీకు తెలిసిన వాళ్లకు చెప్పండి. మీరు సినిమా చూస్తే మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు. హండ్రెడ్ పర్సెంట్ మీరు హ్యాపీగా ఫీలవుతారు. అన్నారు.
ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ – మా రోమాంచకం సినిమా థియేటర్స్ లో బాగా రన్ అవుతోంది. మేము ఏ పర్పస్ తో ఈ సినిమా చేశామో ఆ పర్పస్ వందశాతం నిజమైంది. ఒక కామెడీ స్క్రిప్ట్ పేపర్ మీద ఉన్నప్పుడు డిస్కస్ చేసినప్పుడు తెరపైకి తీసుకొచ్చినప్పుడు అనేక సవాళ్లు ఉంటాయి. అది నేను సందీప్ తరుచూ మాట్లాడుకునేవాళ్లం. హాస్యం పండించడం అంత సులువు కాదు. మా డైరెక్టర్ వేణు ఆ విషయంలో విజయం సాధించారు. మాకు ఆయన చెప్పిన కథలో ఎంత ఫన్ ఉందో, థియేటర్స్ లో చూస్తుంటే అదే కనిపించింది. ఎక్కడా నవ్వులు తగ్గలేదు. మా మూవీ రిలీజై నాలుగున్నర రోజులు అవుతోంది. 8.5 కోట్ల రూపాయలు కలెక్షన్స్ వచ్చాయి. ఇంకా స్ట్రాంగ్ గా రన్ అవుతోంది. ఏపీ, తెలంగాణలో థియేటర్స్ విజిట్ చేసి చూస్తే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ కనిపించింది. వాళ్లు సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. మా బ్యానర్ లో ఏ హీరోతో సినిమా చేసినా ఆ హీరో కెరీర్ లో బెస్ట్ మూవీ ఇచ్చాం. సుమంత్ ప్రభాస్ కెరీర్ లో కూడా బెస్ట్ మూవీ అయ్యింది. మా సినిమాలో నటించిన వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తుండటం సంతోషంగా ఉంది. ఈ సినిమా తర్వాత మా టీమ్ లోని వారుకు ఓ నాలుగు సినిమాలు వస్తాయనే ఇంటెన్షన్ తో చేసిందే గానీ డబ్బుల కోసం చేసిన సినిమా కాదిది. డైరెక్టర్ వేణు 17 ఏళ్ల కష్టం ఈ సినిమా. రోమాంచకంతో మా బ్యానర్ లో మరో సూపర్ హిట్ సినిమా చేరడం సంతోషంగా ఉంది. అన్నారు.








