బ్లాక్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న అందాల రాశి
ఊహలు గుసగుసలాడే(Oohalu Gusagusalade) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రాశీ ఖన్నా(Raashi Khanna) మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ఎంతోమందిని ఆకట్టుకుంది. తక్కువ టైమ్ లోనే టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే సినిమాలతోనే కాకుండా రాశీ సోషల్ మీడియా ద్వారా కూడా ఎంతో మంది ఎట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉండే రాశీ తాజాగా బ్లాక్ కలర్ అవుట్‌ఫిట్ లో కుర్రాళ్లకు మతిపోయే ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో రాశీ హాల్టర్ నెక్ బాడీ సూట్, దానికి తగ్గ హై వేస్టెడ్ ట్రౌజర్స్ ధరించి, మినిమల్ మేకప్ తో, సింపుల్ హెయిర్ స్టైల్ తో చాలా స్టైలిష్ గా కనిపించగా, ఆ ఫోటోలకు కుర్రాళ్లు లైకుల వర్షం కురిపిస్తూ, వాటిని తెగ షేర్ చేస్తున్నారు.








