అసెంబ్లీ చరిత్రలోనే ఈ రోజు చీకటి రోజు : సునీతా లక్ష్మారెడ్డి
ఇవాళ అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేలకు అవమానం జరిగిందని సునీతా లక్ష్మారెడ్డి (Sunitha Lakshma Reddy) అన్నారు. అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనలపై బీఆర్ఎస్ మహిళా నేతలు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ (Assembly) చరిత్రలో ఈరోజు చీకటి రోజని మండిపడ్డారు. ఇది ఆడబిడ్డల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు. మహిళలంటే సీఎంకు గౌరవం లేదని బీఆరఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గొంతులు నొక్కాలని సీఎం పోలీసుల ( Police)కు ఆదేశం ఇచ్చారా? అని ప్రశ్నించారు. సునీతా లక్ష్మారెడ్డి చీర లాగారని, ఇవాళ అసెంబ్లీ వద్ద జరిగిన ఘటన హేయమైనదని మండిపడ్డారు. అసెంబ్లీ చరిత్రలోనే ఇలాంటి ఘటన చూడలేదన్నారు.








