రాజ్మా కర్రీలో ఈ ట్విస్ట్ ట్రై చేయండి.. టేస్ట్ అదిరిపోతుంది
ఇప్పుడు అందరూ డైట్ ను పాటించే విధానంలోనే వున్నారు. అతి తక్కువ ఆహారం, అత్యంత ప్రోటీన్లతో కూడిన ఆహారానికే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నారు. అంతేకాకుండా జంక్ ఫుడ్ కి చాలా దూరంగా వుంటూ, వేపుళ్లను కూడా ముట్టుకోవడం లేదు. ఇలాంటి వారికి రాజ్మా కర్రీ అద్భుతంగా ఉపయోగపడుతుంది.
రాజ్మా.. రుచితో పాటు పోషకాలు

రాజ్మా కర్రీ రుచిలోనే కాకుండా ఆరోగ్యప్రయోజనాల్లోనూ విశేషమైనది. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. రాజ్మాలో Plant-based protein ఎక్కువగా వుంటుందని వైద్యులు చెబుతుంటారు. మాంసాహారం ముట్టుకోకుండా కేవలం శాకాహారం తినే వారికి ఇది మంచి కండ పుష్టిని కలిగిస్తుంది. వారికి మంచి ఆహారం కూడా. అలాగే జీర్ణక్రియకు మంచి మేలు చేస్తుంది. ఇందులో అధికంగా ఫైబర్ వుంటుంది. దీని ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధక సమస్యను కూడా ఇది నిరోధిస్తుంది.
బరువు, గుండె ఆరోగ్యానికి రాజ్మా

ఇవి కూడా చదవండి
ఫైబర్ మరియు ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల రాజ్మా తింటే త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది అతిగా తినడాన్ని తగ్గించి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇప్పుడు దీనిని చాలా మంది వాడుతున్నారు. అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా చాలా మంచిది. అంతేకాకుండా షుగర్ ను పెరగకుండా నియంత్రణలో వుంచుతుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ మరియు రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.రాజ్మాలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఉండటం వల్ల శరీరానికి అవసరమైన శక్తిని నిలకడగా అందిస్తుంది.
రాజ్మా కర్రీ తయారీ విధానం

ముందుగా రాజ్మాను రాత్రంతా నీళ్లలో నానబెట్టుకోవాలి. ఉదయాన్నే నీళ్లన్నీ వడగట్టుకుని మంచి నీళ్లు పోసి కుక్కర్లో వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కాస్త పసుపు వేసి కలిపి మీడియం ఫ్లేమ్‌లో 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని ఆ తర్వాత ప్రెజర్ పోయాక మూత తీసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.ఈ లోగా 2 ఉల్లిపాయలు పెద్ద ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో కొద్దిగా గ్రైండ్ చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. అదే విధంగా 2 టమోటాలు కూడా పెద్ద ముక్కలు చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోగా రాజ్మా ఉడికిపోతుంది.
కర్రీ తయారీ కోసం కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులతో పాటు అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్, అర టీ స్పూన్ పసుపు వేసుకుని పచ్చి వాసన పోయే వరకు మగ్గించాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత నూనె తేలుతుంది. ఈ సమయంలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేలా 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ కూడా వేసుకోవాలి.కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న రాజ్మా వేసుకుని గ్లాసు నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చి మిర్చి, కరివేపాకు వేసుకుని బాగా కలిపి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి.








