తీరం దాటిన అర్నబ్ తుపాను
ఆంధ్రప్రదేశ్‌ని వణికించిన అర్నబ్ (Arnab Cyclon) అతి తీవ్ర తుపాను తీరం దాటింది. యానాం (Yanam)కు నైరుతి దిశలో నరసాపురాని (Narasapura)కి సమీపంలో తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే ప్రక్రియ పూర్తయిందని, అతి తీవ్ర తుపాను తీవ్ర తుపానుగా బలహీనపడినట్లు వెల్లడించింది. తీరం దాటిన నేపథ్యంలో ఉభయ గోదావరి (Godavari districts) జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మధ్యాహ్నం వరకు వర్షాల తీవ్రత కొనసాగుతుందని వాతావరణశాఖ (Meteorological Department) పేర్కొంది.








