భోగాపురం టూ బ్యాంకాక్ – ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
భోగాపురం (Bhogapuram) అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్ (Bangkok) కు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) నాన్‌స్టాప్ సర్వీసు ప్రారంభమైంది. ఉదయం 11.35 గంటలకు బయలుదేరి సాయంత్రం 4.20 గంటలకు బ్యాంకాక్ చేరుకునేలా షెడ్యూల్ రూపొందించారు. వారంలో ప్రతి మంగళవారం, శుక్రవారం విశాఖ నుంచి బ్యాంకాక్‌కు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని జీఎంఆర్ యాజమాన్యం తెలిపింది.
ఈ నెల 28న బ్యాంకాక్ నుంచి విమానం భోగాపురం రానుంది. ఇతి ప్రతి బుధ, శనివారాల్లో బ్యాంకాక్‌లో అక్కడి కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2.10 గంటలకు బయల్దేరి, భోగాపురానికి ఇక్కడి కాలమానం ప్రకారం ఉదయం 3.55 గంటలకు చేరనుంది. భోగాపురం విమానాశ్రయాన్ని అంతర్జాతీయంగా అనుసంధానించటం లో ఈ సర్వీసు మైలురాయిగా నిలుస్తుందని జీఎంఆర్ సంస్థ సీఈవో కన్వర్బీర్ సింగ్ కల్రా (Kanwarbir Singh Kalra) పేర్కొన్నారు.








