వైభవంగా పైడితల్లి సిరిమానోత్సవం
విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం (Vizianagaram Paidithalli Sirimanotsavam) అంగరంగ వైభవంగా జరిగింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు తరలివచ్చారు. ఉదయం తల్లికి ప్రత్యేక పూజులు జరగ్గా, మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఊరేగింపు ప్రారంభమైంది. అనంతరం సిరిమాను చదురుగుడి నుంచి కోట వరకు మూడు సార్లు తిరిగింది. ఏనుగు రథం, అంజలి రథం, బెస్తవారి వల, పాలధార వెంట కదిలాయి. భక్తులు అరటిపండ్లు (Bananas) విసురుతూ మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం గోవా గవర్నర్, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు (Pusapati Ashok Gajapathi Raju) కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి (Ram Sundar Reddy) పట్టువస్త్రాలు అందించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు తల్లి సేవలో తరలించారు. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు.








