ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడమే లక్ష్యం :చంద్రబాబు
అర్నబ్ తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు భారీ స్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టామని, ప్రాణ, ఆస్తి నష్టాన్ని వీలైనంతగా తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) స్పష్టం చేశారు. మత్స్యకారులకు (Fishermen) చెందిన 30 వేలకు పైగా బోట్లను సముద్రం నుంచి వెనక్కి రప్పించామని, గోపాల్పూర్ (Gopalpur)లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 93 బోట్లు, వాటి సిబ్బంది సురక్షితంగా ఉన్నారని తెలిపారు. వైద్య సేవల కోసం 1,316 అంబులెన్సుల (Ambulances)ను సిద్ధం చేయడంతోపాటు, 5వేల మంది గర్భిణులను సమీపంలోని ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రులకు తరలించినట్లు వెల్లడించారు. విద్యుత్ అంతరాయాలను వెంటనే పునరుద్ధరించేందుకు 8,400 మంది సిబ్బందిని సిద్ధం చేశామని, తుపాను ప్రభావంతో 15 వేల వరకు విద్యుత్ స్తంభాలు పడిపోయే అవకాశం ఉందని అంచనా వేసి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.








