చరిత్ర సృష్టించిన నిత్యా రామన్.. లాస్ ఏంజెల్స్ మేయర్ రేసులో నిత్య రామన్ విజయం
అమెరికా మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత మేయర్ కారెన్ బాస్ ను ఓడించి లాస్ ఏంజిల్స్ మేయర్ ఎన్నికల్లో నిత్యా రామన్ విజయం సాధించారు. దీంతో ఆ నగరానికి మొట్ట మొదటి ఆసియా- అమెరికన్ మేయర్ గా ఖ్యాతి కెక్కారు. నగర స్థాయి అత్యున్నత పదవికి ఎన్నికైన రెండవ మహిళ కూడా ఆమెనే. కేరళలో జన్మించి, అమెరికాలో స్థిరపడిన నిత్యా రామన్.. అరుదైన రాజకీయ ఘనతనే సాధించారు.
లాస్ ఏంజెలెస్ మేయర్ ఎన్నికల్లో 51.1 శాతం ఓట్లు సాధించి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుత మేయర్ కరెన్ బాస్ కి 48.33 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. డెసిషన్ డెస్క్ హెచ్ క్యూ ఎన్నికల అంచనాల ప్రకారం నిత్యా రామన్ విజయం ఖాయమైపోయింది. దీంతో ఆమె లాస్ ఏంజెలెస్ కి 44వ మేయర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.
నిత్యా మీనన్ 1981 లో కేరళలో జన్మించారు. ఆ తర్వాత అమెరికాకి వలస వెళ్లింది కుటుంబం. 22 ఏళ్ల వయస్సులోనే అమెరికా పౌరసత్వం పొందారు. హార్వర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన ఆమె.. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అర్బన్ ప్లానింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు.గతంలో సామాజిక సమస్యల పరిష్కారంపై కూడా పనిచేశారు.
లాస్ ఏంజెలెస్ రాజకీయాల్లో నిత్యా రామన్ కి అనుభవం వుంది. 2020 లో తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి సిట్టింగ్ సిటీ కౌన్సిల్ సభ్యుడు డేవిడ్ ర్యూను ఓడించారు.







